‘ చిరు ‘ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ‘ విశ్వంభరా ‘ ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్..?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. లక్షలాది మంది అభిమానాన్ని పొంతం చేసుకున్న చిరంజీవి.. ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకొని టాలీవుడ్ మెగాస్టార్ గా మారాడు. ఆయన అందుకున్న అవార్డ్‌లు, సక్సెస్‌లు చిరంజీవి క్రేజ్‌కు నిదర్శనం. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీడి వ‌శిష్ట‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Megastar Chiranjeevi looks dashing in the latest still of Vishwambhara |  Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఈ సినిమాలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయని.. ఒకదాన్ని మించి మరొక ట్విస్ట్ ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా.. ఇందులో ఇద్దరు చిరంజీవిలు ఉంటారట. ఇంటర్వెల్ ముందు సీన్లో ఇద్దరు చిరంజీవిలు.. ఒకరికి ఒకరు ఎదురుపడతారని.. ఇది సినిమాకే హైలెట్గా నిలవనుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఇంటర్వెల్ సీన్.. లీక్ అవడంతో మూవీ టీమ్ అంతా నిరాశ చెందుతున్నార‌ట‌.

Chiranjeevi ready for nonstop Vishwambhara schedule | cinejosh.com

సినిమాలో ట్విస్ట్‌లు ఎంత గోప్యంగా ఉంచాలని ప్రయత్నించిన‌.. అవి లీకైపోవడంతో ఏం చేయాలో తెలియక మూవీ టీం చింతిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఒక చిరంజీవి క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుందని.. మరో చిరంజీవి పాత్ర నడివి కొంతకాలం మాత్రమే ఉంటుందని.. మధ్యలో ఆయన పాత్రకు ముగింపు జరుగుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌లో ఏదైనా మార్పు చేస్తారా.. లేదా.. అదే సిన్‌ను కంటిన్యూ చేస్తారా.. వేచి చూడాలి.