మెసేజ్ చేస్తే పొగరంటూ ఏడేళ్ల పాటు హీరోయిన్ నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో.. కారణం ఇదే..?!

మలయాళ డైరెక్ట్ర్ కం స్టార్ హీరోగా మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు ముకుందన్. తాజాగా ముకుందన్‌ హీరోగా నటించిన మూవీ జై గణేష్. రంజిత్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించింది. వీళ్లిద్దరూ కాంబోలో ఇది రెండో సినిమా కావడం విశేషం. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఈరోజు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో పాల్గొని సందడి చేశారు మహిమ, ముకుందన్. అయితే ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో మహిమ మాట్లాడుతూ హీరో ముకుందన్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వీరిద్దరూ కలిసి 2017లో మాస్టర్ పీస్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ముకుందన్ ఆమెను బ్లాక్ చేశాడని.. దాదాపు 7ఏళ్ళ‌పాటు బ్లాక్ లోనే ఉంచాడని.. మళ్లీ జై గణేష్ మూవీ షూటింగ్ మొదలయ్యే వరకు నన్ను అన్‌బ్లాక్ చేయలేదని చెప్పుకొచ్చింది.

Actress' voice message made Unni Mukundan block Mahima's number; reveals  actor - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online

మాస్టర్ పీస్ లో నటిస్తున్న టైం లో ముకుందన్‌కి తనపై చాలా కోపం వచ్చిందని మ‌హిమా నంబియార్ వివరించింది. నాకు పెంపుడు కుక్కలు అంటే చాలా ఇష్టం. మాస్టర్ పీస్ తర్వాత ఉన్నికి కూడా కుక్కపిల్లలు అంటే చాలా ఇష్టమని తెలియడంతో అతడికి ఒక కుక్క పిల్లను బహుమతిగా ఇవ్వాలనుకున్నా.. నా దగ్గర ఉన్ని నెంబర్ లేకపోవడంతో ఉన్ని ముకుందన్‌ నెంబర్ కోసం రచయిత ఉదయన్‌కు కాల్ చేసి తీసుకున్న. ఆ తర్వాత వాట్స్అప్ లో ఉన్నికి వాయిస్ మెసేజ్ చేశా. నేను మహిమా నేనెవరో మీకు తెలిపే ఉంటుంది. మీ నెంబర్ నాకు ఉదయన్‌ ఇచ్చారు అంటూ ఉదయన్‌ పేరున రెండు మూడు సార్లు చెప్పా. దీంతో రెండో మెసేజ్ పంపే లోపు నన్ను బ్లాక్ చేసేసారు. ఎందుకు బ్లాక్ చేశారు కూడా నాకు అర్థం కాలేదు.

Jai Ganesh Movie (2024): Release Date, Cast, Ott, Review, Trailer, Story,  Box Office Collection – Filmibeat

కానీ తర్వాత వెంటనే ఉదయన్‌కు కాల్ చేసి జరిగింది వివరించా. ఆమెకు చాలా పొగరు, అహంకారి. మిమ్మల్ని ఉదయన్‌ అని పిలుస్తుంది. పెద్దవాళ్ళను ఎలా పిలవాలో ఆమెకు తెలియదా అన్నాడ‌ట‌. అప్ప‌టినుంచి ఏడేళ్లుగా నా నెంబర్ బ్లాక్ చేశాడు అంటూ వివరించింది. ఇదే విషయం ఉన్ని ముకుందని మాట్లాడుతూ అప్పట్లో మహిమపై కోపంతోనే బ్లాక్ చేశా. తర్వాత విషయమే మర్చిపోయా.. చాలా ఏళ్ల తర్వాత మహిమ ఆర్డిఎక్స్ లో నటించి హిట్ అయినప్పుడు చూసా. ఆ తర్వాత రంజిత్ శంకర్ నాకు కథ వివరించారు. మహిమ హీరోయిన్ అని చెప్పగానే గతంలో బ్లాక్ చేసిన విషయం గుర్తొచ్చి వెంటనే అన్‌బ్లాక్‌చేసి మహిమకి మెసేజ్ పంపా.. నేను ఉన్నినీ.. మహిమా నీతో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నా అంటూ వివరించాడు.