మీకు జర్నీలో వాంతులు అవుతున్నాయా..? ఇలా చేయండి..జన్మలో ఇక మీకు ఆ ప్రాబ్లమ్ ఉండదు..!!

చాలామందికి ఇది ఒక పెద్ద ప్రాబ్లం గా ఉండిపోతుంది. జర్నీ అంటే చాలు వాంతులు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ట్రైన్ లో వెళ్తున్నామా ..? బస్సులో వెళ్తున్నామా..? కారులో వెళ్తున్నామా ..? అనే వ్యత్యాసం లేకుండా కొందరికి బాడీ సహకరించక చాలా చాలా వాంతులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. కొంతమంది భయపడిపోయి అసలు జర్నీ చేయడమే మానేస్తారు. చాలామంది జర్నీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు . కొంతమందికి మాత్రమే ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంటుంది .

అయితే ఎవరైతే జర్నీస్ లో వాంథింగ్ బాధలు ఎదుర్కొంటారు వాళ్లకి ఓ అద్భుతమైన చిట్కాను సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు . మీరు జర్నీ చేసే టయానికి ముందు నుంచే కొంచెం పుల్లటి పదార్థాలు తీసుకుంటే మీకు వాంతులు రావు అంటూ సజెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు హెవీగా ఫుడ్ తినకుండా లైట్ గా ఫుడ్ తిని ఉప్పు నీళ్లు పుక్కిలించిన లేదు పికిల్ లాంటివి క్యారీ చేసిన వాంతింగ్స్ రావు అంటూ చెప్పుకొస్తున్నారు.

మరీ ముఖ్యంగా మనకి వాంథింగ్ వస్తుంది వస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటే కచ్చితంగా వచ్చేస్తుంది అని అది కాకుండా జర్నీని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఏదైనా మాట్లాడుతూ ఉంటే వాంతులు రాదని సైలెంట్ గా పడుకుంటే మాత్రం కచ్చితంగా వాంతులు వస్తాయి అని ఆయుర్వేదిక్ నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతేకాదు నిమ్మకాయ పుదినా జ్యూస్ ని క్యారీ చేయడం అలాగే అల్లం తులసి ఆకులను నోట్లో నములుతూ ఉండడం వల్ల వాంతుల బాధలను తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు..!!