‘ అరవింద సమేత వీర రాఘవ ‘ స్టోరీని మంచు విష్ణు మూవీలో ముందే లీక్ చేసిన స్టార్ కమెడియన్.. భలే పట్టేసారే?!

జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తరికెక్కిన మూవీ అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ ఫ్రాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా 2018లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పిన చిత్తూరు యాస డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని మొదటి నుంచి అందరు భావించారు. త్రివిక్రమ్ దీనిపైనే అసలు పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. చివరికి అందరి అంచనాలకు తగ్గట్టుగానే సినిమా హిట్గా నిలిచింది. ఇక ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనే యాక్షన్స్ స‌న్నివేశాల్లో ఎన్టీఆర్ ఇరగదీస్తాడు.

Aravinda Sametha 6 Days Collections

ఎప్పుడు ఫ్యామిలీ కామెడీ, రొమాంటిక్ సినిమాలు తీసే త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్‌తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా అరవింద సమేత వీర రాఘవరెడ్డి తెరకెక్కించాడు. ఈ మూవీలో రక్తపాతం హింసతో కూడిన సన్నివేశాలు కూడా అద్భుతంగా పడ్డాయి. అయితే కొంతమంది సరదాగా ఇప్పటికీ సినిమాను ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మరోసారి సినిమా బాగా ట్రోల్ అవుతుంది. ఓ వీడియో క్లిప్ ని షేర్ చేసి మరీ త్రివిక్రమ్ కధ‌ని కాపీ అంటూ విమర్శిస్తున్నారు. మంచి విష్ణు హీరోగా నటించిన దూసుకెళ్తా సినిమాలో వీడియో క్లిప్ ను.. దీనికి ట్యాగ్‌ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇంత‌కి ఆ సన్నివేశం ఏదో కాదు.. ఓ సీన్లో కమెడియన్ అలీ మాట్లాడుతూ తెలుగు సినిమా స్టోరీ ఇలానే ఉంటుంది అంటూ.. కొందరికి ఒకే కథను రిపీటెడ్‌గా వినిపిస్తూ ఉంటాడు.

అశాంతిగా ఉన్న ఓ ఊరిని హీరో ప్రశాంతంగా మారుస్తాడ‌ని.. కథ‌ ప్రారంభిస్తాడు. అది వింటున్న ఓ వ్యక్తి ఎలా అని ప్రశ్నించగా.. అప్పుడు అలీ సమాధానం ఇస్తూ.. అందరినీ ఇష్టమొచ్చినట్లు కొట్టి.. ఇలా కొట్టి, అలా కొట్టి చివరికి శాంతి వచనాలు చెప్పాలి అంటూ తన పక్క ఉన్న వారిని అందరిని కొట్టేస్తూ ఉంటాడు. అలా అలీ చెప్పిన సిల్లీ స్టోరీనే అరవింద సమేత వీర రాఘ‌వ‌ ప్రామిస్ అంటూ ఫన్నీగా క్యాప్షన్ జోడించి ట్రోల్స్ చేస్తున్నారు. ఇది చూసిన చాలామంది నిజంగానే అలానే ఉంటుంది భయ్యా అంటూ నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ప్రతిసారి ఇలాంటి క‌థ‌లని ఎంచుకుంటూ కంటెంట్ మొత్తం చెడగొడతాడు అంటూ త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు.