ఆ రైటర్లు నాగ్ కోసం రాసుకున్న స్టోరీని కొట్టేసిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ కేవలం సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేస్తూ.. కథలు రాసే బాధ్యత రైటర్ల పై ఉంచేవారు. అలాంటి రైటర్లలో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న పరుచూరి బ్రదర్స్ పేరు కూడా ఒకటి. వీళ్ళిద‌రు చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో భారీ సక్సెస్ అందుకునేది.. ఇక ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల అందరితో వీళ్ళు సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. వీళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా ఆ హీరోల కెరీర్‌లో స్పెష‌ల్‌ సినిమాగా నిలిచాయ‌న‌డంలో సందేహం లేదు.

Paruchuri Brothers 'Rakthi' n 'Bhakthi' | cinejosh.com

ఇలానే వీళ్ళిద్దరూ నాగార్జున కోసం ఒక లవ్ అండ్ యాక్షన్ సినిమా కళ‌ను రాసుకున్నారట. అయితే ఈ కథను నాగార్జున చేస్తేనే బాగుంటుందని వీళ్ళు భావించారని.. మధ్యలో రామానాయుడు ఈ పరుచూరి బ్ర‌దర్శ్‌ను పిలిపించి కథను విని.. ఈ కథ మన వెంకటేష్ తో చేయండి అంటూ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా మరేదో కాదు రాఘవేంద్ర డైరెక్షన్‌లో తెర‌కెక్కి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న కూలి నెంబర్ 1.

Coolie No.1 Movie | Telugu Songs Lyrics

ఈ సినిమా వెంకీ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. అయితే పరుచూరీ బ్రదర్స్ మొదటి నాగార్జునను దృష్టిలో పెట్టుకొని రాసుకున్న ఈ కథ.. ఆయనకు వినిపించనే లేదట. మధ్యలో రామానాయుడు వచ్చి కథను వెంకటేష్ కోసం బుక్ చేసుకోవడంతో ఆయనకి ఇచ్చేసారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పరుచూరి బ్రదర్స్ స్వయంగా వివరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీళ్ళిద్ద‌రు ఎటువంటి సినిమాలను తీయడం లేదు. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కొత్త సినిమాల‌కు మాత్రం రివ్యూలు ఇస్తు వార్త‌లో నిలుస్తున్నారు.