క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి క్రేజీ హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!!

సినీ ఇండస్ట్రీలో చాలామంది మొదట చిన్న నటినట్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా అడుగుపెడుతూ ఉంటారు. అయితే తర్వాత వారే స్టార్ హీరోస్ గా మారి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇలా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా నటిస్తూనే హీరోలుగా అవకాశాన్ని ద‌క్కించుకుని స్టార్ హీరోలుగా మారిన వారు మన టాలీవుడ్‌లో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మొదట గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. మొదట మెగాస్టార్ కూడా ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అడుగుపెట్టి.. తర్వాత స్టార్ హీరోగా తిరుగులేని ఫేమ్‌ సంపాదించుకున్నారు. అలా ఈ జనరేషన్‌లో మొదటి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. క్రేజీ సెలబ్రిటీగా మారీ.. తాము నటించిన సినిమాలతో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి దూసుకుపోతున్నారు.

ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు.. ఆ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సిద్దు జొన్నలగడ్డ.. టాలీవుడ్ లో చాలామందికి ఈ పేరు చెప్పగానే డిజె టిల్లు సినిమానే గుర్తుకు వస్తుంది. ఈ సినిమా కంటే ముందు పాన్ ఇండియా సినిమాల్లో సిద్దు జొన్నలగడ్డ నటించినప్పటికీ.. డీజె టిల్లుతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఒకసారిగా రూ.100 కోట్లకు పైకి కలెక్షన్ కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. ఇదే జోష్లో ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెర‌కెక్కించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా కూడా రూ.500 కోట్ల గ్రాస్ వ‌సుళ్ళ‌ను కల్లగొట్టి భారీ సక్సెస్ అందుకుంది. ఇదే విధంగా మరో స్టార్ హీరో.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టాడు.

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అవకాశాన్ని అందుకున్న విజయ్.. మొదటి సినిమాతోనే క్లాసికల్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని రౌడీ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత నుంచి ఆయన అదే మేనరిజాన్ని కంటిన్యూ చేస్తూ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోగా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు నవీన్ పోలిశెట్టి. జూనియర్ ఆర్టిసి గా కెరీర్ ప్రారంభించిన ఈయన ప్రస్తుతం ఆ సినిమాలో నటిస్తున్నాడంటే.. ఈ సినిమా ఖ‌చ్చితంగా హిట్ అవుతుంది అనే పరిస్థితి నెలకొంది. కాస్త ఆలస్యంగా సినిమాలో నటిస్తున్నప్పటికీ తీసిన ప్రతి సినిమాతోనూ సక్సెస్ అందుకుంటూ క్రేజీ హీరోగా మారాడు నవీన్ పాలిశెట్టి. ఈ ముగ్గురు యంగ్ హీరోస్ ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్టులుగా ఉంటూ సైడ్ క్యారెక్టర్ లో నటించారు.