ఆ హీరోయిన్ బ్యాక్ పై చెయ్యి వేసిన బోనీ కపూర్.. ఘోరంగా ట్రోల్స్.‌.!

సినీ సెలబ్రిటీలు ఏం చేసినా అది కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో రచ్చగా మారుతూ ఉంటుంది. మంచి చేసినప్పుడు అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తారు. అదే ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అంతలాగా సెలబ్రిటీలను గమనిస్తారు మరి.

ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను టార్గెట్ చేశారు కొందరు. ముంబైలో నీ మంగళవారం సాయంత్రం బి టౌన్ సెలబ్స్ కోసం ” మైదాక్ ” స్ర్కీనింగ్ జరిగింది. ఈ మూవీకు నిర్మాతగా వ్యవహరించిన పోనీ కపూర్ తో సహా పలువులు సెలబ్రిటీలు మరియు సినిమా టీం కూడా హాజరైంది.

ఈ క్రమంలోనే ఇందులో హీరోయిన్గా నటించిన ప్రియమణి చీరలో వచ్చి అలా అట్రాక్ట్ చేసింది. అయితే ఆమె స్టేజ్ మీదకు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న క్రమంలో బోనీకపూర్ ఆమె నడుము పై చేయి వేసి ఫోటోలను దిగాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి పలువురు ఘోరంగా విరుచుకుపడుతున్నారు.