వేసవి కాలంలో జుట్టును బలంగా మార్చే సింపుల్ టిప్స్ ఇవే..!

సాధారణంగా వేసవికాలంలో ప్రతి ఒక్కరి జుట్టు పాడైపోతూ ఉంటుంది. ఇందుకు కారణం ఉష్ణోగ్రతలు. ఉష్ణోగ్రతలను తట్టుకుని మీ హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. వాటిలో మొదటి చిట్కా నూనె పెట్టడం. వేసవిలో ఎండకు జుట్టు పొడిబారి పోతూ ఉంటుంది. నాచురల్ ఆయిల్ కూడా తగ్గిపోతాయి. దీనిని నివారించేందుకు స్నానం చేసే గంట ముందు నూనె అప్లై చేయడం మంచిది.

అనంతరం షాంపూ తో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. మీ జుట్టుకు తగిన, కెమికల్స్ తక్కువగా గల తేలుకైనా షాంపూ వాడడం మంచిది. దీనివల్ల కుదుళ్లలో నాచురల్ ఆయిల్స్ తగ్గకుండా ఉంటాయి. అదేవిధంగా ఎండాకాలంలో తప్పనిసరిగా చేయాల్సిన పని వీరు ఎక్కువగా తాగడం.

నీరు ఎక్కువగా తాగడం వల్ల జుట్టుకే కాదు మీ శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో తలస్థానం చేసిన అనంతరం జుట్టుకు కండిషనర్ ఉపయోగించడం మంచిది. దీనివల్ల వెంట్రుకలు పొడిబారకుండా ఉంటాయి. ఇక ఎండాకాలంలో అనే కాదు ఏ కాలంలో అయినా హెయిర్ డ్రయర్ ఉపయోగించకుండా ఉండడం మేలు. దీనివల్ల జుట్టు రాలిపోతున్న సమస్య ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఎండాకాలంలో పైన చెప్పిన జాగ్రత్తలను తీసుకుని మీ జుట్టును సురక్షితంగా ఉంచుకోండి.