ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇది ఐదోసారి అవుతుంది.. మ్యారేజ్ పై హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్..?!

హీరోయిన్‌ అంజలి పెళ్ళి చేపుకుందంటూ ఇప్ప‌టికే చాలాసార్లు మ్యారేజ్‌ రూమర్లు వినిపించాయి. తాజాగా ఈ వార్త‌ల‌పై ఆమె రియాక్ట్ అయ్యింది. వాటికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. అద్దె ఇవ్వాలంటూ కామెంట్ చేసింది. టాలీవుడ్‌లో తనకుంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఆమె హీరోయిన్‌గా ఆక‌ట్టుకుంటుంది. ఇటీవల కాలంలో అంజలికి సినిమా ఛాన్స్‌లు బాగా త‌గ్గాయి. చాలా అరుదుగా కనిపిస్తున్న అంజ‌లీ తాజాగా మెయిన్‌ లీడ్ పోషించిన‌ మూవీ గీతాంజలి2.. మళ్ళీ వచ్చింది. ఈ మూవీ త్వ‌ర‌లో ముందుకు రానుంది.

ఈ క్ర‌మంలో తాజాగా ట్రైలర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో అంజలి సంద‌డి చేసింది. సినిమాకు సంభందించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. త‌న‌ అంజలి పెళ్లి ప్రస్తావన రావ‌డంతో దానిపై స్పందించిన అంజ‌లి.. ఆమెపై త్వరలోనే అంజలి మ్యారేజ్‌ చేసుకోబోతుందంటూ వ‌స్తున్న‌ రూమర్స్ వినిపించడంతో రిపోర్టర్‌ ఆ ప్ర‌శ్నించాడు. దీనిపై అంజలి మాట్లాడుతూ రిపోర్టర్‌కి సూప‌ర్‌ కౌంటర్ వేసింది. అంజలి చెబుతూ, పెళ్లికి రావాల్సింది నేను, నాకే చెప్పకుండా ఇప్పటికే నాకు నాలుగు సార్లు పెళ్లి చేసేశారు. ఇప్పుడు మ‌ళ్ళీ ఐదో సారి మ్యారేజ్‌ చేయడానికి చూస్తున్నారు. నేను రీసెంట్‌గా ఈ వార్తలు విన్నాను. పెళ్లి అయితే చేసుకుంటా.. కానీ ఇప్పుడే కాదు.. ఇప్పుడు వస్తున్న‌ వార్తలకు నాకు ఏ సంబంధం లేదు.

నేను మరో విషయం విన్నా.. ఎవరితోనో లివింగ్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్నానని రాశారు నేనే మా ఇంట్లోనే ఉండటం లేదు. ఔట్ డోర్‌లో ఉంటున్నా. అక్క‌డ ఉంటున్నవాళ్లు ఎవరో నాకు రెంట్‌ ఇచ్చేసి వెళ్లితే బాగుంటుంది, ఈఎంఐలు కట్టుకోవడానిక పనికొస్తాయి అంటూ తనదైన స్టయిల్‌ లో సెటైర్లు వేసింది అంజలి. పెళ్లి మ్యాటర్‌ ఇప్పట్లో లేదని తేల్చి చెప్పిన ఆమె ఇక సినిమా ఆఫర్లు వస్తున్నాయి.. కానీ అవ‌న్ని మూవీస్‌ చేయడం లేదని, మంచి స్టోరీలు మాత్రమే చేస్తున్నా అంటూ వెల్లడించింది. ప్రస్తుతం గీతాంజలి మళ్లి వస్తుంది సినిమాతో ఈ రెండో వారంలో ఆడియెన్స్ ముందుకు రానుంది అంజలి. మరోవైపు `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`లో ఐటెమ్‌ సాంగ్ లో మెర‌వ‌నుంది. రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌`లో ఓ కీలక పాత్రలోను క‌నిపించ‌నుంది.