ఎన్టీఆర్ తో విశ్వక్, సిద్దు.. వీరి కలవడానికి వెనుక అసలు సీక్రెట్ ఇదే..?!

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో విశ్వక్, సిద్దు కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద స్టోరీ నడుస్తుందని వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ పూర్తి ఫ్యామిలీ మ్యాన్.. ఉంటే సినిమాలు, లేదంటే ఫ్యామిలీ తోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా రేర్ గా ఆయన బయట కనిపిస్తాడు. ఏదైనా ఈవెంట్ కి గెస్ట్ గా మెరుస్తాడు. లేదంటే విదేశాలకు వెళ్లే టైంలో ఎయిర్పోర్ట్లో కనిపిస్తాడే త‌ప్ప ఇక బ‌య‌ట అంత‌గా క‌నిపించ‌ని ఆయ‌న ఇప్పుడు యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి బయటకు వస్తున్నాడు. తనని అభిమానించే వారి కోసం వారిని సపోర్ట్ చేసేందుకు ఈవెంట్లలో కనిపిస్తున్నాడు.

ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్.. విశ్వక్ కలిసి దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో తారక్ విశ్వక్‌ను గట్టిగా హగ్ చేసుకుని కనిపించాడు. దీంతోపాటు తారక్, సిద్దు జొన్నలగడ్డ, నిర్మాత నాగావంశీ ఉన్న ఓ సెల్ఫీ పిక్ కూడా వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోగ‌ అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, విశ్వక్ కలిసి దిగిన ఫోటో మరింత హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే టిల్లు స్క్వేర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. కలెక్షన్ పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాటలోకి అడుగుపెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా గ్రాస్వసులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో గ్రాండ్ గా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేస్తున్నారట మేకర్స్. దీనికి ఎన్టీఆర్ ని గెస్ట్ గా ఆహ్వానించారని.. అందుకోసమే ఈ షో ఏర్పాటు.. సెల్ఫీలు, ఫోటోలు దిగినట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక తారక్‌ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కళ్యాణ్‌రామ్‌, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10 న దసరా కానుకగా రిలీజ్ కానుంది.