కెరీర్ స్టార్టింగ్ లో రాజమౌళిని తక్కువ అంచనా వేసిన నటుడు.. తీరా టాలెంట్ చూసి సారీ చెప్పాడా.. ఆయన ఎవరంటే..?!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను తెర‌కెక్కించే ప్రతి సినిమాతోనూ భారీ సక్సెస్ అందుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న జక్కన.. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో ఈసారి పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమా తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో రాజమౌళి కూడా సినిమాను ఓ విజువల్ వండ‌ర్‌గా చూపించాల‌ని అహర్నిశలు శ్రమిస్తున్నాడు.

Rajamouli's Made in India is based on this legendary filmmaker | Latest  Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఇదిలా ఉంటే రాజమౌళి కెరీర్ మొదట్లో సై సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించారు. ఇక ఈ మూవీలో విలన్ పాత్రను పోషించిన ప్రదీప్ రావత్‌కు ఆయ‌న‌ క్యారెక్టర్ ఎలా ఉండాలో.. పాత్ర లిమిటేష‌న్స్ ఏంటో స్కెచ్ ద్వారా వివరించారట. ఇక అది చూసిన ప్రదీప్.. రాజమౌళి తీసింది రెండు సినిమాలే కదా తనని తాను ఎక్కువగా ఎస్టిమేట్ చేసుకుంటున్నాడు అని భావించాడట. పేపర్ మీద చూపించిన అంత డెప్త్ సినిమాలో ఉంటుందా ఏంటి అని తనలో తానే నవ్వుకున్నాడట‌. ఇలాంటి డైరెక్టర్లను మనం కెరీర్‌లో చాలామందిని చూసామని భావించాడట.

Hemanth NBK 🦁 on X: "@T2BLive Maaku kuda ye anil kumar yadav telidu, maaku  telisindi bikshu yadav okkade https://t.co/VsdTKqTFLX" / X

కానీ రాజమౌళితో షూటింగ్ మొద‌ల‌య్యిన త‌ర్వాత ఆయ‌న ఒపినియ‌న్ మొత్తం మారిపోయింద‌ట‌. జ‌క్క‌న డెడికేషన్ చూసి షాక్ అయ్యాడట ప్రదీప్ రావత్. తర్వాత రాజమౌళి తోనే మీ గురించి చాలా తక్కువగా అంచనా వేశాను సారీ అని చెప్పారట. దీంతో రాజమౌళి మాట్లాడుతూ మనం ఏ పని చేసిన పూర్తి ఎఫర్ట్ పెట్టి చేస్తే ఔట్‌పుట్ బెస్ట్ గానే ఉంటుంది అని నేను నమ్ముతా. అందుకే నేను చేసే ప్రతి పని పర్ఫెక్ట్ గా ఉండాలని భావిస్తా అని వివరించారట. మొత్తానికి ప్రదీప్ రావత్ కి రాజమౌళి స్టామినా ఏంటో ఆ సినిమాతో క్లారిటీ వచ్చేసింది.