రాజమౌళి సినిమాలలో తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి నచ్చని సినిమా ఏంటో తెలుసా.. కారణం అదేనా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు జ‌క్క‌న‌. ఆయన తెర‌కెక్కించిన ప్రతి సినిమా సక్సెస్ సాధించినా వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయాయి. ఇక రాజమౌళి సినిమాలకు కథల అందించే ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌కి కూడా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన కొన్ని సినిమాలు అంతగా నచ్చలేదట‌. వాటిని స‌రిగా ఎంజాయ్ చేయలేకపోయానని ప‌లు సంద‌ర్భాల‌లో వివరించాడు.

SS Rajamouli's father and screenwriter Vijayendra Prasad to direct film on  RSS soon: 'RSS has made one mistake...' | Entertainment News, Times Now

ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ మూవీస్ న‌చ్చ‌క‌పోవ‌డానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఆ సినిమాలలో ఎక‌టి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ. ఈ సినిమా బాగున్నా ప్రేక్షకులు కూడా దీనిని సరిగ్గా ఆస్వాదించలేకపోయారు. ఈ విషయాన్ని విజయేంద్రప్రసాద్ పలు సందర్భాల్లో వివరించాడు. అయితే ఈ మూవీ స్టోరీని అందించింది కూడా విజయంప్రసాద్ కావడం గమనార్హం. యమదొంగ సినిమా ఎంతో శ్రమించి తెరకెక్కించిన ఈ సినిమాలో ఇంకా ఏదో చిన్న పాయింట్ మిస్సయింది అని.. సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఫీలవుతారు. దీని కారణంగానే ఈ సినిమాను ఒక్కసారి కంటే ఎక్కువగా చూడడానికి ఇష్టపడరు అంటూ వివ‌రించారు.

Yamadonga | Cinema Chaat

అలానే విజయేంద్రప్రసాద్ కు నచ్చని మరో సినిమా మర్యాద రామన్న. కమెడియన్ సునీల్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా సక్సెస్ అయినా చాలామంది ఈ సినిమాను అంతగా ఎంజాయ్ చేయలేకపోయారు. అదే సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, బాహుబలి లాంటి సినిమాలు మాత్రం ఎన్నిసార్లు రిపీట్ అయినా ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలు ఇప్పుడు వేసిన కూడా చాలా ఫ్రెష్ గా ఆడియన్స్ ఫీల్ అవుతారు అంటూ వివ‌రించాడు. దీంతో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన యమదొంగ, మర్యాద రామన్న సినిమాలను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా అంతగా ఎంజాయ్ చేయలేకపోయారని తెలుస్తుంది.