సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో అన్ని రికార్డులు సృష్టించడానికి ఆ ఇద్దరు డైరెక్టర్లే కారణమా.. ?!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడి ఉండర‌న‌టం అతిస‌యోక్తి కాదు. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈయన జానపద, పౌరాణిక, కుటుంబ నేప‌ద్య ఇలా అన్ని రకాల కథలలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎటువంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయి నటించడం కేవలం తారక రామారావుకు మాత్రమే సాధ్యమైంది. ఇకపోతే ఎన్టీఆర్ ఎన్ని సంచలనాన్ని సృష్టించడానికి టాలీవుడ్కు చెందిన ఆ ఇద్దరు దర్శకుల ప్రమేయం కూడా ఎంతో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వారిద్ద‌రు ఎవరు.. వారు చేసిన సహాయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇద్దరు స్టార్ డైరెక్టర్స్‌ దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు. వీరిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ తో పోటాపోటీగా పలు సినిమాలు రూపొందించి కమర్షియల్ హిట్లను అందుకున్నారు.

ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించారు. మనుషులంతా ఒక్కటే.. సినిమాతో మొదలైన వీరి సినీ కెరీర్‌లో.. ఎన్నో విజయాలను అందుకున్నారు. 1976లో రిలీజ్ అయిన మనుషులంతా ఒక్కటే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తర్వాత సంవత్సరమే అడవిరాముడు సినిమాతో రాఘవేంద్రరావు ఎన్టీఆర్ ను హీరోగా చూపించారు. ఈ సినిమా కూడా కమర్షియల్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత డ్రైవర్ రాముడు, సింహబలుడు, కేడి నెంబర్ 1 ఇలా ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ రేంజ్‌ను మరింత పెంచేలా రాఘవేంద్రరావు తెర‌కెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. కేవలం రెండు సంవత్సరాల్లో ఎన్టీఆర్ తో రాఘవేంద్ర ఏకంగా 5 సినిమాలను రూపొందించి అన్ని సినిమాల‌తో సక్సెస్ సాధించారు.

ఇక దాసరి నారాయణరావు మనుషులంతా ఒక్కటే సినిమాకు నాలుగు సంవత్సరాలు గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. 1980లో సర్కస్ రాముడు అనే సినిమా తీయగా ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. అయితే వెంటనే ఎన్టీఆర్ సినిమాలలో ప్రసిద్ధిగాంచిన సర్దార్ పాపారాయుడు.. సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు దాస‌రి. ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్గా నిలిచింది. ఆపై విశ్వరూపం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. దీంతో ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశానికి అందుకుంది. ఇలా ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు.

ఇక దాసరి నారాయణరావు ఎన్టీఆర్ తో బొబ్బిలి పులి సినిమాకు శ్రీకారం చుట్టి.. అతి తక్కువ టైంలోనే సినిమాలు రిలీజ్ చేయగా సినీ ఇండస్ట్రీలోనే ఇది ప్రభంజనాన్ని సృష్టించింది. ఇక చివరిలో 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత మరోసారి ఎన్టీఆర్ రాఘవేంద్రరావు తో కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమా తెర‌కెక్కించారు. ఈ సినిమా కూడా ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. ఎటువంటి గొడవలు లేకుండా వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ సినిమాలు తీశారు. ఒక్కదాని వెంట ఒకటి వరుసగా హిట్లు పడడమే ఈ సక్సెస్ కు కారణం. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు మధ్య ఉన్న పోటీ తత్వమే ఎన్టీఆర్‌కు ఇన్ని సక్సెస్‌లు అందించిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు కూడా ఇదే విధంగా స్పోర్టివ్ గా పోటీ తత్వాన్ని చూపిస్తే టాలీవుడ్ సినిమాలు వరుసగా సక్సెస్ సాధించడం ఖాయం.