బిగ్ బ్రేకింగ్: అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన స్టార్ హీరో..ఫ్యాన్స్ కు టెన్షన్ టెన్షన్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ -కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అజిత్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కేవలం తమిళ్ జనాలు మాత్రమే కాదు. తెలుగు జనాలు కూడా ఆయనను బాగా లైక్ చేస్తూ ఉంటారు. కాగా అజిత్ తాజాగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు . ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

అయితే చాలామంది ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . అజిత్ కి ఏమైనా బాగోలేదా..? ఆ కారణంగానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా..? అంటూ ఆరా తీస్తున్నారు . ఫైనల్లీ అజిత్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళాడో క్లారిటీ వచ్చేసింది . అజిత్ హఠాత్తుగా హాస్పిటల్ కి వెళ్లడానికి కారణం ఆయనకు మైల్డ్ ఫీవర్ గా ఉండడమే . ఇప్పుడు సిచువేషన్ ఎలా ఉందో మనకు తెలిసిందే.

ఫీవర్ వస్తే తగ్గడం లేదు . ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి వచ్చారట . రెండు రోజుల నుంచి అజిత్ కు ఫీవర్ ఎక్కువగా ఉందట. ఆ ఫీవర్ గురించి తెలుసుకోవడానికి అజిత్ హాస్పిటల్ అడ్మిట్ అయినట్లు తెలుస్తుంది . దీనితోపాటు అతడికి నార్మల్ చెకప్స్ కూడా చేసి ఒకటి రెండు రోజుల్లో ఇంటికి పంపించేస్తారట. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో పలువురు అది అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

అయితే చెప్పా పెట్టకుండా సడన్గా హాస్పిటల్ బయట అజిత్ కనిపించడంతో జనాలు భయపడిపోయారు. అజిత్ కి ఏమైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉందా ..? అంటూ కూడా ప్రచారం చేశారు . అలాంటిది ఏదీ లేదు అని డైలీ రొటీన్ చెకప్ కోసమే ఆయన హాస్పిటల్ కి వెళ్ళారు అని క్లారిటీ రావడంతో అందరూ ప్రశాంతంగా ఉన్నారు..!!