“ఇక పై అలాంటి యాడ్స్ లో నటిస్తే ఊరుకోం”.. సినీ స్టార్స్ కి కేంద్ర స్ట్రైట్ వార్నింగ్..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఒకపక్క సినిమాలో నటిస్తూ మరొక పక్క పలు రకాల కమర్షియల్ యాడ్స్ లో నటిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో నటించే దానికంటే రెండు రెండు నిమిషాల యాడ్లో కనిపించినందుకు కోట్లపారితోషకం తీసుకుంటారు . చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇదే పని చేస్తూ ఉంటారు . రీసెంట్గా అలాంటి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది .

ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ప్రజల దృష్టిని బెట్టింగ్ – గ్యాంగ్ వైపు మళ్లించే ప్రకటనలపై ఎవరైనా నటిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేసింది. బెట్టింగ్ గ్యాంగ్ తో సహా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన యాడ్స్ లో నటిస్తే తగిన చర్యలు తీసుకోబడును అంటూ నోటీసులు జారీ చేసింది . ఇటీవల కాలంలో అలా చేసిన స్టార్స్ చాలామంది ఉన్నారు . ఓపెన్ గానే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు.

2019 కి అనుగుణంగా చట్టాల ప్రకారం నిషేధించబడిన చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు ప్రచారం ఆమోదాన్ని నిషేధించబడినవి అంటూ నొక్కి చెప్పింది. దీంతో స్టార్ సెలబ్రిటీల పాలిట ఇప్పుడు ఇది ఓ శాపంలా మారింది . ఏదో రెండు నిమిషాల యాడ్లో నటించామా..? కోట్లు అకౌంట్లో వేసుకున్నామా..? అని సరిపెట్టుకున్న సెలబ్రిటీస్ ఇప్పుడు ఏ యాడ్ చేసిన సరే దానికి ముందు వెనుక ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది..!!