అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఈషా అంబానీ వేసుకున్న ఈ జాకెట్ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..?!

రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్ జామ్‌న‌గర్‌లో ఈ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్రతారాలంతా ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఇక అంబానీ రేంజ్‌కు తగ్గట్టుగానే ఈ వేడుకలు కళ్ళు చెదిరే రేంజ్ లో లగ్జరీయ‌స్‌గా జరిగాయి. ఆ వేడుకలు యావత్ ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్నాయి అనడంలో సందేహం లేదు.

గెస్ట్‌ల అతిధ్యం దగ్గర నుంచి వింధు, ధరించిన బట్టల వరకు ప్రతిదీ ఒక సంచలనంగా మారింది. ఆ వేడుకల్లో నీతా అంబానీ కూతురు ఈషా అంబాని ధరించిన బట్టలు ప్రస్తుతం నెట్టింట హాట్‌ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అంబానీ బిడ్డ కాబట్టి ఆ రేంజ్ లోనే ఉంటాయి అందులో స్పెష‌ల్ ఏంటి అనుకున్నేరు. అంతకుమించి వేరే లెవెల్ అన్నట్టు ఉండడంతోనే ప్రస్తుతం ఇషా అంబాని ధరించిన జాకెట్ కాస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ లెహంగా కాస్ట్ ఎంత.. దాని స్పెషాలిటీ ఏంటి.. ఒకసారి తెలుసుకుందాం.

ఆమె ఈ ప్రి వెడింగ్ వేడుకల్లో చివరి రోజు లెహంగా డిజైనర్ బ్లౌజులు ధరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇందులో హైలెట్గా నిలిచింది ఏంటంటే ఆమె రేంజ్‌కు త‌గ్గ‌టుగా డిజైన్ చేయించుకున్న బ్లౌజ్‌. ఆమె ధరించిన ఈ బ్లౌజ్ ప్రతి ఒక్కరిని స్టన్ అయ్యేలా చేసింది. ఈ బ్లౌజ్‌ని మనం చెవులకు ధరించే బంగారు జూకాలతో డిజైన్ చేయించారు. అది కేవలం బంగారమే కాదు.. బంగారం పొదగబడిన వజ్రాలు, వైడూర్యాలు, కెంపులతో డిజైన్ చేశారు. ఆ డిజైనింగ్ కుట్లు వేసేందుకు సిల్వర్ ఎత్నటిక్ త్రెడ్ ను యూజ్ చేశారు. బ్లౌస్ లో ఉన్న ప్రతి ఆభరణం ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది. దీంతో ఈమె ఈవెంట్ లోనే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక దీనికి కోట్ల‌లో ఖ‌ర్చు అయ్యింద‌ట‌. ఒక్కసారి మీరు కూడా ఆ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారో ఈ వీడియోలో చూసేయండి.