అంబానీ కొడుకు పెళ్లి కి వెళ్ళినందుకు .. రామ్ చరణ్ ఎన్ని కోట్లు పుచ్చుకున్నాడో తెలుసా..?

సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ కు మండించే ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టార్గెట్ చేసే ఆకతాయిలు ఎక్కువగా మారిపోయారు . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాక చరణ్ పేరు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతూ ఉండడం చూసి ఓర్వలేని యాంటి మెగా ఫ్యాన్స్ ఆయన పై దుమ్మెత్తి పోస్తున్నారు. రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన ..అనంత్ అంబానీ – రాధిక ప్రీ వెడ్డింగ్ లో మెరిశారు.

చాలామంది ప్రముఖులు ఈవెంట్ కు హాజరయ్యారు. అయితే ముఖేష్ అంబానీ స్టార్ సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చి మరి తన ఇంటి ఫంక్షన్ కు రప్పించుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ కూడా ఆ లిస్టులోకి యాడ్ అయిపోయాడు . రామ్ చరణ్ కి దాదాపు 50 కోట్లు ఖర్చు చేసి మరి ముకేశ్ అంబానీ తన ఇంటికి పిలిపించుకున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది .

రాంచరణ్ డైరెక్ట్ గా రెమ్యూనరేషన్ లా తీసుకోకుండా ఖర్చులకి ఫ్లైట్ ఖర్చులకి రూమ్ రెంట్ కి ఆయనకు పెట్టిన గిఫ్ట్స్ కి మొత్తం కలిపి దాదాపు 50 కోట్లు ఖర్చయిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇదంతా ఫేక్ అంటున్నారు మెగా అభిమానులు . రామ్ చరణ్ వాళ్ళని డబ్బులు అడగలేదని .. అది వాళ్ళ సంస్కారం అని చెప్పుకొస్తున్నారు . ప్రజెంట్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే మూవీలోను నటించబోతున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటించబోతుంది..!!