టీ తో కలిపి ఈ ఆహారం తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలిస్తే మళ్లీ అలా చేయరు..?!

చాలామందిలో ప్రతిరోజు క‌చ్చితంగా టీ తాగే అలవాటు ఉంటుంది. రోజు ఉదయం, సాయంత్రం సమయంలో టీ తాగుతూ రిలీఫ్ అవుతుంటారు. అలా టీ అలవాటు అయినవారు ఒక్కరోజు దానిని తాగకపోయినా ఏదో కోల్పోయిన‌ట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే టీ తో పాటు బిస్కెట్స్ లేదా బన్ లేదా పకోడీ లాంటి స్నాక్స్ ను కూడా జత చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ టీతోపాటు మనం తీసుకునే కొన్ని చిరుతిళ్లు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయని నిపుణులు వివరించారు. అసలు టీ తో తీసుకోకూడని ఆహార పదార్థాలు.. వాటిని తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు.. ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టీతో పాటుగా డీప్ ఫ్రై చేసిన ఆహారాలను, చాలా స్పైసీగా ఉండే పదార్థాలను అస‌లు తీసుకోకూడదట.

ఇవి పేగుల్లో ఆమ్లత్వాన్ని ఎక్కువ చేసి జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తాయి. టీతోపాటుగా కేక్స్, డోన‌ట్స్‌, పేస్ట్రీస్ లాంటివి అస్సలు తినకూడదు. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచడమే కాదు.. శరీరంలో శక్తి స్థాయిలు తగ్గించి.. అలసటకు కారణమవుతాయి. అలాగే టీతో పాటు ఉప్పు కలిగిన బంగాళదుంప చిప్స్‌, సాల్టెడ్ గింజలు లాంటి వాటిని అసలు తీసుకోకూడదట. వీటిని తీసుకోవడం వల్ల ఉభరంతో పాటు రక్తపోటు కూడా కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే టీ తో మసాలా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండెలో మంట జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఎదురవుతాయి. ఈ టీతో పాటుగా నిమ్మ జాతికి చెందిన సిట్రస్ పండ్లను కూడా అసలు తీసుకోరాదు. అలా తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లత్వం పెరిగి యాసిడ్ రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. అదే విధంగా టీ తో పాటు నాన్ వెజ్ ఆహారాన్ని కూడా తినకూడదు.

మాంసంలో ఉండే ప్రోటీన్ టీతో మిక్స్అప్ అయితే జీర్ణ సమస్యకు అసౌకర్యం కలుగుతుంది. దీనితో పాటు టీతో చీజ్‌ కేక్, ఐస్ క్రీమ్, క్రీమ్ ఎక్కువగా ఉండే కేక్స్, బిస్కెట్లు లాంటి వాటిని కూడా అసలు తీసుకోకూడదట. వాటిలో కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కడుపులో మంట, అజీర్ణ సమస్యలకు దారితీస్తోంది. ఫ్రెంచ్ ప్రైస్‌, చికెన్ లాంటి వాటిని కూడా టీతో పాటు స్నాక్స్ గా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రెజర్వేటివ్స్, ప్రాసెసింగ్ ఫుడ్ కలిసిన ఆహారాలను టీతోపాటు తినకూడదు. అజీర్ణ సమస్యలు ఎదురవుతాయి. వీటికి బదులుగా టీతోపాటు డైట్ బ్యాలెన్స్ చేస్తూ సంతృప్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోండి. అంటే పండ్లు, గింజలు, తృణధాన్యాలతో చేసిన క్రాకర్స్ వంటి తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవచ్చు.