ఈ బ్లూ టీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

ప్రస్తుత జీవన శైలిలో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు ఏవో ఒక వైరల్ ఇన్‌ఫెక్షన్స్ లేదా మరి ఏదైనా చిన్న చిన్న సమస్యలకు గురవుతూనే ఉంటారు. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఈ సమస్యలు మన దరిచేరకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలకు త్వరగా చెక్ పెట్టాలన్న ఎన్నో పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంతో ఆరోగ్యమైన పోషకాహారానికి ప్రత్యామ్నాయంగా ఒక బ్లూ టీ ప్రతిరోజు అలవాటు చేసుకున్న సరిపోతుంది.

ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం ఈ శంఖుపూలతో తయారు చేసిన టీ తాగడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది. శంఖుపూలు ఎక్కువగా శివుడిని పూజించేందుకు వాడుతూ ఉంటారు. ఇక ఈ శంఖుపూలతో తయారు చేసిన బ్లూటీ ని రోజు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యా ప్రయోజనాలు ఉంటాయి. ఈ టీ ని ప్రతి రోజు పరగడుపున తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి, బాడీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు, ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యలు లేకుండా స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇచ్చి ప్రశాంతంగా ఉండేందుకు సహకరిస్తుంది.

అయితే ఇంత‌కీ ఈ టీని ఎలా తయారు చేసుకోవాల‌నేగా మీడైట్.. అదెలానో ఒకసారి తెలుసుకుందాం. పొయ్యి వెలిగించి ఒక గిన్నెలో గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక.. ఆరు శంంఖు పువ్వులు, ఒక అంగుళం అల్లం ముక్క వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరిగించాలి. ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయిన తర్వాత ఓ స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.