త్వరలోనే రిలీజ్ కానున్న కుమారి ఆంటీ డాక్యుమెంటరీ.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె గురించి తెలియని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. 13 ఏళ్లుగా రోడ్డుపై ఫుడ్ కోర్ట్ నడిపిస్తూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సాయి కుమారి (కుమారీ ఆంటీ) గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె కనిపిస్తుంది. ఆమె తన ఫుడ్ కోర్ట్ కు వచ్చే వారితో చక్కగా మాట్లాడుతూ.. వారికి కావలసిన ఆహారాని అందిస్తూ.. చాలామంది అభిమానాన్ని సంపాదించుకుంది. అలా పలువురు యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయ్యి మరింతగా ఆమె వ్యాపారం మెరుగయ్యే పరిస్థితి వచ్చింది.

ఇక ఇటీవల కాలంలో రోడ్ పై ట్రాఫిక్ జామవుతుందని కారణంతో ఫుట్ కోర్ట్‌ను పోలీసులు మూసివేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ హోట‌ల్ మళ్ళీ తెరిపించడమే కాదు.. త్వరలోనే ఆమె ఫుడ్ కోర్ట్ వద్దకు వెళ్తానంటూ చెప్పడం జరిగింది. ఇది అంతా డ్రామేటిక్ అనిపించిన జరిగింది ఇదే. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ లో డాక్యుమెంటరీ తీసేందుకు సన్న హాలు జరుగుతున్నాయి. ఆ డాక్యుమెంటరీలో స్వయంగా కుమారి ఆంటీ నే నటించబోతుందట.

ఈ మధ్య నెట్‌ఫ్లిక్స్‌లో కర్రీ అండ్ సైనాయిడ్ డాక్యుమెంటరీ ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే కుమారి ఆంటీ డాక్యుమెంటరీని కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారట. ఈ డాక్యుమెంటరీ కాస్త సినిమాటిక్ గా తీస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు youtube లో సందడి చేసిన కుమారి ఆంటీ త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయనుంది.