సుహాస్ ‘ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ‘ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు సుహాస్‌. తీసింది అతి తక్కువ సినిమాలైనా కంటెంట్‌తో పాటు త‌న పాత్ర‌కు ప్ర‌ధాన్య‌త‌ ఉన్న కథలను ఎంచుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా సైలెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో వచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.8 కోట్ల 60 లక్షలు వసూళ్లను కొల్లగొట్టిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. తొలిరోజే ఈ మూవీ రూ.2.28 కోట్ల వసుళ్ళు దక్కించుకుంది. ఇక ఆదివారం రూ. కోటి డెబైఐదు లక్షల వరకు కలెక్షన్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇటీవల వచ్చిన మిగతా చిన్న సినిమాలతో పోల్చుకుంటే ఈ మూవీ చాలా బెటర్.

కాగా ఇటీవల ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఫ్యామిలీ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకున్నట్లు తెలుస్తుంది. రిలీజ్ అయిన నాలుగు నుంచి ఐదు వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి ఈ సినిమా రానుందట. అంటే మార్చ్ 8 లేదా మార్చి 15న ఆహా ఓటీటీలో అంబాజీపేట మ్యారేజ్ బ్యిండు రిలీజ్ అవుతుంది. ఇక మార్చి ఫస్ట్ వీక్ లో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.