మెగా కోడలా మజాకా.. ఒక్కే ఒక్క మాటతో మెగా ఫ్యాన్స్ ని తన వైపు తిప్పుకునేసిందిగా.. దట్ ఈజ్ లావణ్య..!

లావణ్య త్రిపాఠి.. ప్రజెంట్ పేరు సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు హీరోయిన్గా చూసిన లావణ్య త్రిపాఠిను ఇప్పుడు అందరూ ఓ దేవతలా చూస్తున్నారు . దానికి కారణం మెగా ఫ్యామిలీ. మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు తన కొడుకుకు లావణ్య త్రిపాఠి ని ఇచ్చి పెళ్లి చేశారు . అఫ్ కోర్స్ వీళ్లది ప్రేమ వివాహం. ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ప్రేమించుకున్న ఈ జంట ఫైనల్లి అభిమానులను సర్ప్రైజ్ చేసింది .

సడన్గా ఈ జంట పెళ్లిని చేసుకుంటున్నాం అంటూ ప్రకటించింది . ఈ ఊహించని సర్ప్రైజ్ తో అభిమానులు షాక్ అయిపోయారు. కాగా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఫస్ట్ నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ . ఈ సిరీస్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. రీసెంట్ గా ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ పై తనకున్న ప్రేమను బయటపెట్టింది . ఇలాంటి క్రమంలోనే లావణ్య త్రిపాఠి ని హోస్ట్ ప్రశ్నిస్తూ ..”మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా మెగా ఫ్యాన్స్ వదిన అంటూ పిలుస్తున్నారు కదా .. మరి దానిపై మీ ఒపీనియన్ ఏంటి ..?” అంటూ ప్రశ్నించారు .

దీనికి లావణ్య త్రిపాఠి చాలా ఎక్సలెంట్ ఆన్సర్ వచ్చింది. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ..”అలాంటి ప్రేమ ఆప్యాయత అభిమానం దక్కించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది . మెగా ఫ్యామిలీలో అడుగు పెట్టడం ఇంకా హ్యాపీగా ఉంది . అంత ప్రేమగా నన్ను వదినా అంటూ పిలుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టేసింది . ఒకే ఒక్క మాటతో మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు లావణ్య త్రిపాఠిను నెత్తిన పెట్టేసుకుంటున్నారు మెగా అభిమానులు..!!