జగపతిబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏం జరిగిందంటే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు ఒకప్పుడు వరుస సినిమాలో నటించి ఫుల్ పాపులారిటి దక్కించుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాలు నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న ఆయ‌న‌ కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు విలన్ గా, తండ్రిగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే సినిమాల్లో నటిస్తున్న జగపతిబాబు.. త‌న న‌ట‌న‌తో ప్రశంసలు అందుకుంటున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు పలు పోస్టులతో సందడి చేస్తున్నాడు. ఇక తాజాగా జగపతిబాబు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్లు షేర్ చేసుకున్నాడు. మా మ్యేనేజర్ మహేష్ నా కొడుకు లాంటి వాడి పుట్టినరోజు సందర్భంగా.. ఇప్పటికీ నా ఫ్యామిలీతో పాటు ఉండే మా ఫ్యామిలీ మెంబర్స్ తో మా ఇంట్లో భోజనాల పండగ.

నాకు ఒక్కడికే రోజంతా మజ్జిగ.. పాపం నేను.. అంటూ వివరించాడు. ప్రస్తుతం జగపతిబాబు చేసిన పోస్ట్ ని నెట్టింట‌ వైరల్ అవుతుంది. అది చూసిన జగపతిబాబు ఫ్యాన్స్ మీ దగ్గర పని చేసే వాళ్లను కూడా ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే నిజంగా మీరు గ్రేట్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం పాపం మజ్జిగ మాత్రమే ఎందుకు.. మీరు కూడా భోజనం ఎంజాయ్ చేయొచ్చు కదా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.