సన్యాసం పుచ్చుకున్న ఆర్జీవి హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీ సడన్ గా సర్ప్రైజ్ ఇస్తున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక బాటలో కనిపిస్తుంటే.. మరికొంతమంది అంతకుమించి మరో స్టేప్‌ వేసి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. ఇటీవల ఇలాంటి నిర్ణయంతోనే స్టార్ బ్యూటీ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. మోడల్గా పెద్ద పెద్ద ఈవెంట్లో రాణించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐశ్వర్య రాయ్‌ లాంటి స్టార్ బ్యూటీలకు పోటీగా నిలిచింది. అయితే ఫ్యాన్స్‌కు సడన్ షాక్ ఇస్తు సన్యాసిగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

ఆమె భార్ఖా మదన్. ఈ పేరు పెద్దగా తెలిసి ఉండదు.. కానీ ఒకప్పుడు ఈమె.. పేరున్న మోడల్. 1994 మిస్ ఇండియా ఫైనల్స్‌లో రన్నర్ ఆఫ్ గా నిలిచింది. దేశమంతా జేజేలు కొట్టిన సుస్మిత సేన్‌, ఐశ్వర్యరాయ్‌లతో కూడా పోటీపడిన ఈ ముద్దుగుమ్మ.. మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నర్ ఆఫ్ గా నిలిచింది. తర్వాత సినీ కెరీర్ ప్రారంభించి సక్సెస్ఫుల్గా రాణించింది. 1990లో ఖిలాఢీ కా ఖిలాఢీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2003లో రామ్ గోపాల్ వర్మ బూత్ సినిమాలో నటించి మెప్పించింది సినిమాల్లో దయ్యం పాత్రలో అందరినీ భయపెట్టడమే కాకుండా నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్నే మార్చేసింది.

అటు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా సత్తా చాటిన భర్ఖ 49 ఏళ్ల వయసులో షాకింగ్ డేసిషన్ తీసుకుంది. అకస్మాత్తుగా సన్యాసం పుచ్చుకొని సన్యాసిగా మారిపోయింది. తన పేరును కూడా మార్చేసుకుంది. గొల్డెన్ సామ్టేన్ అనే పేరుతో సన్యాసిగా మరి కాషాయం కట్టి పర్వతాలు, ఆశ్రమాల్లో తిరుగుతూ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికపై కూడా తన ఆధ్యాత్మిక అంశాలనే పోస్ట్ చేస్తుంది. తలైలామా ఫాలోవర్గా ఉన్న భర్ఖ‌ 2012లో బౌద్ధ మతాన్ని స్వీకరించాలని అనుకుందట. కానీ అప్పుడు పరిస్థితులతో అది వీలుప‌డ‌లేదు. ఇక ప్రస్తుతం ఆమె ఆశ్రమ జీవితం గడుపుతూ ధ్యానం, ప్రార్థనలు, ప్రజల సేవా కార్యక్రమాలతో బిజీగా గడుపుతుంది.