నేషనల్ క్రష్ రష్మిక రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మల్లో రష్మిక మందన కూడా ఒకటి. అంతేకాదు ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ బ్యూటీలలో కూడా నేషనల్ క్రష్ ఉంది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. కన్న‌డా, తెలుగు సినిమాలలో భారీ పాపులారిటీ దక్కించుకుంది. కొద్ది కాలంలోనే తమిళ్, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ అందుకుంది. ఇక పుష్ప 2 సినిమాతో నేషనల్ క్ర‌ష్ గా మారిన ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయింది.

యానిమల్ మూవీ తో బ్లాక్ బస్టర్ కొట్టి మరింత హైప్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్న ఈమె ఈ సినిమాతో పాటు రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిగా రిలీజ్ అయిన యానిమల్ మూవీ కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుందంటూ వార్తలు వినిపించాయి. ఇక లేడి ఓరియంటెడ్ ఫిల్మ్‌ గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఏకంగా రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట.

తాజాగా రష్మిక రెమ్యూనరేషన్ మరింత పెంచిందని తెలుస్తుంది. ఒక తెలుగు ప్రాజెక్టుకు రూ.4 కోట్లు డిమాండ్ చేస్తుందట ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ వర్గాల్లో చర్చనీయాంసంగా మారింది. హీరోయిన్లు ఎంత భారీ మొత్తం డిమాండ్ చేస్తే టాలీవుడ్ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఖచ్చితంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ నిపుణులు చెబుతున్నారు. రష్మిక కు ఫుల్ పాపులారిటీ ఉన్న రెమ్యూనరేషన్ను కాస్త తగ్గించుకుంటే బాగుంటుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ కన్న టాలీవుడ్ మేకర్స్ తక్కువ బడ్జెట్ ఎఫ‌ర్ట్‌ చేయగలరు. హీరోయిన్లు కాస్త సహకరించాలి అంటూ వారు చెబుతున్నారు. ఇక సినిమాలోనే కాకుండా ఇతర హీరోయిన్ లాగా బ్రాండ్ ప్రమోషన్స్ లో కూడా సందడి చేస్తూ ఉండే రేష్మిక మోడలింగ్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తుంది. గ‌తేడాది వచ్చిన ఓ నివేదికలో రష్మిక నెలకు రూ.70 లక్షలు పైగా సంపాదిస్తుందని తెలుస్తుంది. ఇక రాఫ్మిక ఆస్తి విలువ రూ.60 కోట్లు ఉంటుందట. మొత్తానికి రష్మిక ఆటు సినిమాల్లో, ఇటు యాడ్ల ద్వారా కూడా తన సంపాదనలో దూసుకుపోతుంది.