ఏంటి.. గోధుమ గడ్డితో ఏకంగా ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చా.. తప్పకుండా తెలుసుకోండి..

గోధుమ గడ్డి ఆరోగ్యానికి మంచిద‌ని నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే ఇందులో ఉండే పోషకాలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతూ ఉంటాయి. ఇంతకీ అపోషకాలు ఏంటి? అవి శరీరానికి ఎలా ఉపయోగపడతాయో ఒకసారి చూద్దాం. గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్ వాపు నుంచి రిలీఫ్ ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉండే ఈ వీట్ గ్రాస్ తినడం వల్ల గుండె సమస్యలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. క్యాన్సర్ కణాలను తొలగించడానికి గోధుమ గడ్డి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో క్యాన్సర్ నిరోధక అంశాలు కూడా ఉన్నాయి.

గోధుమ గడ్డిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి. ఇక క్యాన్సర్ వచ్చిన వారు కూడా ఆ వ్యాధితో పోరాడడానికి గోధుమ గడ్డి సహకరిస్తుంది. ఇది కీమోథెరపీ క్యాన్సర్ తో పోరాడడంలో కీలక పాత్ర వహిస్తుంది. కీమోథెర‌ఫీలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న అలాంటి పరిస్థితుల్లో గోధుమ గడ్డిని తీసుకోవడం ద్వారా దీనిలో ఉండే హానిని తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియాల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉండే ఈ గోధుమ గడ్డి ఫుడ్ పాయిజనింగ్ నుండి కూడా రక్షిస్తుంది. వీట్ గ్రాస్ జ్యూస్ చేసుకుని తాగడం వల్ల బాడీలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అంత బయటకు వచ్చేస్తుంది. పైగా ఇది ఆహార విషాన్ని కరిగించవచ్చు. ప్రతిరోజు గోధుమ గడ్డిని తినే వ్యక్తులకు ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉండదు.

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. దీంతో గుండె సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అలాగే వీట్ గ్రాస్ తో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. దీని వాడడం టైప్ 2 డయాబెటిస్ రోగులకు చాలా మంచిది. రోజువారి ఆహారంలో గోధుమ గడ్డి జ్యూస్ చేసుకుని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పరిణామం కనపడుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఈ గోధుమ గడ్డిలో ఉండే ఓ రకమైన ఎంజాయ్‌మ్‌లు ఆహారకణాలను విచ్చిన్నం చేసి పోషకాలను గ్రహించడానికి తోడ్పడుతాయి. ఇది తినడం వల్ల ఆహారం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ బాడీని డీటాక్సీఫై చేస్తుంది. ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలకు ఇది చెక్కబడుతుంది.