ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఈ సింపుల్ చిట్కాలతో మీ తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..

ఇటీవల కాలంలో తెల్ల జుట్టు సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది. చిన్న వయసులోనే టెన్షన్లతో మరేవో కారణాలతో తెల్ల జుట్టు వస్తుంది. అలాంటి సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో దొరికే అన్ని రకాల ను ప్రోడక్ట్స్ వాడేస్తూ చుట్టూ సమస్యలను మరింత పెంచుకుంటున్నారు. ఇలా అన్ని ప్రొడక్ట్స్ వాడటం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి ఇంటి చిట్కాలు ఫాలో అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టు నల్లగా మార్చుకునే సింపుల్ విధానం ఏంటో ఒకసారి చూద్దాం.

ఒక బౌల్లో టీ పొడిని మెత్తగా చేసుకుని ఒక స్పూను, అర టీ స్పూన్ కాఫీ పొడి, 50 ml కొబ్బరి నూనె, ఆర చెక్క నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని డబల్ బాయిల్ పద్ధతిలో గిన్నెలో నీళ్ళు పోసి బాయిల్ చేయాలి. నూనె వేడి అయ్యాక గాజు సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనె రెండు నెలల వరకు వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు తయారు చేసుకున్న సరినోతుంది. నూనెను గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించుకోని పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

రెండు గంటలు అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే తెల్ల జుట్టు కాస్త నల్లగా మారడం ఖాయం. అలాగే జుట్టు రాలే సమస్యలు సమస్య, చుండ్రు స‌మ‌స్య‌లు కూడా తగ్గిపోతాయి. అయితే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి.. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల టైం పడుతుంది. తక్కువ తెల్ల జుట్టు ఉంటే కొద్ది వారాలలోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.