“ప్రపంచంలో ఉండాల్సిన బూతు అంత అక్కడే ఉంది”.. సందీప్ రెడ్డి వంగ ఊర నాటు కామెంట్స్.. ఇచ్చిపడేశాడుగా..!

సందీప్ రెడ్డి వంగ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు . సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా ఆయన కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన సినిమా యానిమల్. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా దాదాపు 900 కోట్లు కలెక్షన్స్ రాబట్టి సంచలన రికార్డులను నెలకొల్పింది.

అయితే ఈ సినిమాని ఎంతమంది జనాలు ఎగబడి చూశారో అంతేమంది స్టార్స్ కూడా తిట్టిపోశారు. సినిమాలో టూ బోల్డ్ కంటెంట్ ఉందని అసలు ఇలాంటి సినిమాలు ఎలా తెరకెక్కిస్తారని ..సమాజానికి ఏం ఉపయోగకరమని నానా బూతులు తిట్టారు.. చాలా విమర్శలు చేశారు .. అయితే సందీప్ రెడ్డివంగా పెద్దగా పట్టించుకోలేదు . కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో మాత్రం ఘాటుగా కౌంటర్లు ఇచ్చి పడేసాడు . అమీర్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలకు ..”మాజీ భర్త కూడా అలాంటి సినిమాలు చేశాడని కౌంటర్ ఇచ్చిన సందీప్”.. తాజాగా జావేద్ అక్తర్ కి కూడా ఇచ్చి పడేసాడు .

బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్.. ఇటీవల యానిమల్ లాంటి సినిమాలు చూస్తే ఈ సమాజానికి ప్రమాదకరమని ..కూసింత ఘాటుగానే మాట్లాడారు . తాజాగా సందీప్ రిప్లై ఇస్తూ..” అసలు ఆయన చేసిన కామెంట్స్ చూస్తుంటే ఆయన సినిమా చూడలేదని బాగా తెలుస్తుంది ..అలా సినిమా చూడకుండా మాట్లాడే వాళ్ళ గురించి నేనేం చెప్పగలను .. అలా మాట్లాడే వాళ్ళు ఒకసారి చుట్టుపక్కల వాళ్ల పరిసరాలను పట్టించుకోవాలి జావేద్ కొడుకు ఫర్హాన్ అక్తార్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో ఎంత బూతులు ఉన్నాయో మనకు తెలుసు ..ప్రపంచంలో ఉన్న బూత్ అంతా అక్కడే ఉంది . అయితే తెలుగులో అసలు ఆ సిరీస్ చూడలేదేమో .. మరి తన కొడుకుకి ఎందుకు నీతి వ్యాఖ్యలు చెప్పలేదు ..?” అంటూ కౌంటర్ వేశాడు . అంతేకాదు తన డైరెక్షన్ పై వేలెత్తి చూపించే వాళ్లను ఘాటుగా ఇచ్చిపడేశాడు. ప్రజెంట్ సందీప్ రెడ్డివంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..!