బన్నీ ” పుష్ప 2 ” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పకి సీక్వెల్ గా పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది. ఇక ప్రస్తుతం పుష్ప 2 నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కి రంగం సిద్ధమైనట్లు కన్ఫర్మ్ అయింది.

ఈ సినిమా నుంచి ఈ ఫిబ్రవరి రెండో వారంలో కొన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అయితే ఇవి ఎటువంటి టీజర్ కానీ పోస్టర్ రిలీజ్ లకి సంబంధించినవి కాదని తెలిపారు. దీంతో పుష్ప 2 నుంచి ఏ అప్డేట్స్ వస్తాయో అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.