అమీర్ ఖాన్ మాజీ భార్య పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ‘ యానిమల్ ‘ డైరెక్టర్.. కారణం ఇదే..

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించి భారీ బ్లాక్ బ‌స్టర్ మూవీ యానిమల్. ఇప్పటికి ఈ సినిమా ప్రకంపాలు కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఈ సినిమా ఓటీటీలో రిలీజై సందీప్ పై మరిన్ని విమర్శలు మొదలయ్యాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో వ‌చ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దరూ. 900 కోట్లకు పైగా గ్రాస్‌వశుల‌ను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేస్తుంది. తండ్రి, కుమారుల సెంటిమెంట్తో వచ్చిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుంటూ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేశారు. ఇక రిలీజైన తర్వాత నుంచి ఇప్పటికే ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి తీవ్ర స్థాయిలో ముప్పు తప్పదు అంటూ మహిళ ఎంపీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

స్త్రీ విద్వేష సినిమాలను కట్టడి చేయాలి అంటూ వివరించారు. ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తాజాగా స్పందించింది. ఈ సినిమా స్త్రీ విద్వేషంతో నిండి ఉందని చెప్పుకొచ్చింది. బాహుబలి 2, కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉంటాయని చెప్పుకొచ్చింది. బాహుబలి సినిమా ప్రారంభంలో స్త్రీ పాత్రలను బలంగా చూపించిన చివరకు శృంగార బొమ్మలానే చూపించే ప్రయత్నం చేశారంటూ వివరించింది. ఇలాంటి సినిమాలు వల్ల సమాజానికి ఉపయోగం లేకపోగా కీడు కలుగుతుంది అంటూ ఆమె చెప్పకొచ్చింది.

దీనిపై సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. నా సినిమాల గురించి విమర్శించే ఆమెకు ఓ విషయం చెప్పాలనుకుంటున్న. మీరు ముందుగా అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడండి. ఈ సినిమాలో ఆయన దాదాపు అమ్మాయి పై హత్యాచారం చేసేందుకు చూస్తాడు. ఆ అమ్మాయిదే తప్పు అనేలా చూపించే ప్రయత్నం చేస్తాడు. కానీ అదే అమ్మాయి చివరకు అతడితో ప్రేమలో పడుతుంది. ఈ సినిమాను ఎలా అర్థం చేసుకోవాలి.. ముందు ఇలాంటి సినిమాలు గురించి మాట్లాడిన తర్వాత మా సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. గతాన్ని మరచి మా సినిమాలను విమర్శించడం మంచిది కాదు గుర్తుంచుకోండి అంటూ సందీప్ రెడ్డి ఫైర్ అయ్యాడు.