అందరి ముందు చిన్నపిల్లడిలా కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్.. ఏం జరిగిందంటే..?

బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు సోహెల్. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన ఆటతో లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోహెల్ క్రెజ్‌కు తగ్గట్టుగా హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలో నటిస్తూ బిజీ అయిపోయాడు. అయితే ఆయన చేసిన ఒక్క సినిమా కూడా సరిగ్గా హిట్ కాలేదు. కాగా తాజాగా బూట్ కట్ బాలరాజు సినిమాతో శుక్రవారం థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సోహెల్. ఇక‌ ఈ మూవీకి హీరో గానే కాకుండా, నిర్మాతగాను సోహెల్ వ్యవహరించాడు. తన తండ్రి రిటైర్మెంట్ అవ్వ‌గా వచ్చిన పెన్షన్ డబ్బులతో పాటు తన సంపాదన అంతా ఈ సినిమాపై పెట్టాను.

ఇంత కష్టపడి సినిమా రిలీజ్ చేసిన తర్వాత సినిమా చూడ్డానికి జనం థియేటర్స్ వద్దకు వెళ్లకపోవడంతో చాలా చోట్ల షోలు తీసేసారు. దీంతో మీడియా సమక్షంలో సోహెల్ కన్నీరు పెట్టుకున్నాడు. కంటెంట్ ఉంటే కచ్చితంగా సినిమాను జనం ఆదరిస్తామంటారు.. కానీ అలాంటి సినిమా వచ్చినప్పుడు మూవీని చూస్తేనే కదా కంటెంట్ ఉందో లేదో అర్థమవుతుంది.. సినిమా అనేది ఫ్రెండ్స్ తో మాత్రమే చూసేది కాదు. ఫ్యామిలీస్ తో కూడా చూడొచ్చు. అలాంటి సినిమానే బూడ్ కట్ బాలరాజు. ఇందులో ఎలాంటి వాల్గారిటీ లేదు. ప్లీజ్ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్.

నా సినిమాని రెండు రాష్ట్రంలోనూ చాలా చోట్ల థియేటర్స్ లో వేశారు. కొన్నిచోట్ల షోసే పడలేదు. ఇక్కడ హైదరాబాదులో రెస్పాన్స్ చాలా బాగుంది. మిగిలిన చోట్ల కనీసం 30 నుండి 40 మంది కూడా థియేటర్స్ కు రావడం లేదు. ఇక మేము సినిమా ఎలా తీయాలి. దీనికి తోడు సినిమా కనీసం 20 నిమిషాలు కంప్లీట్ కాకుండానే ఓ వ్యక్తి రివ్యూ టైప్ చేయడం మొదలుపెట్టేసాడు. ఆ వ్యక్తిని నేను వీడియో కూడా తీశా. రివ్యూవర్స్‌ను నేను తప్పు పట్టడం లేదు. కానీ అతను సినిమా అవుతూనే ఉంది రివ్యూ రాసేయడం మొదలు పెట్టేసాడు. మనిషి అన్నప్పుడు తన బాధ చెప్పుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా నెగిటివ్గా ప్రచారం చేయకండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహెల్. ప్రెజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.