త్వరలోనే ఆ హీరోతో మల్టీస్టారర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఎన్టీఆర్ మాటలు..!

మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ ఎక్కువగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా అలా మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి ఎక్కువ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో ఫాన్స్ ఓ రేంజ్ లో సంబరపడిపోతున్నారు. ఇప్పుడు సింగిల్ గా స్టార్ సినిమాలల్లో నటించడం కన్నా.. మిగతా హీరోలతో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

గతంలో జయప్రదతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు . జయప్రద ..”మీరు మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తారా..? మీరు ఏ హీరోతో మల్టీస్టారర్ చేయాలి అనుకుంటున్నారు అని ప్రశ్నించింది.. దీనికి తారక్ ఓపెన్ గా ఆన్సర్ ఇస్తూ ..”నేను మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి రెడీ.. నాకు అవకాశం వస్తే నేను మొదటిగా చూస్ చేసుకునే హీరో మహేష్ బాబు ..ఆయనతో మల్టీ స్టార్ సినిమా చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను.. ఇన్ఫాక్ట్ నేను దానికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు .

దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు నందమూరి – ఘట్టమనేని అభిమానులు . మరెందుకు ఆలస్యం డైరెక్టర్ లు.. ఎవరైనా స్క్రిప్ట్ రాయండి.. అదిరిపోయే రేంజ్ లో ఉండాలి ..బాక్సాఫీస్ చరిత్ర తిరగరాయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్తో మల్టీ స్టారర్ సినిమా చేశాడు . అంతేకాదు ప్రెసెంట్ దేవర సినిమాలో నటిస్తున్నాడు . అదేవిధంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలోనూ నటిస్తున్నాడు..!!