ఈ ఫోటోలో బొద్దుగా ముద్దుగా కనిపిస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు నాజూకు సుందరి.. ఇండస్ట్రీ గ్లామర్ క్వీన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?!

అందంగా కనిపించడం కోసం హీరోయిన్స్ ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ఫిట్నెస్ కాపాడుకోవడానికి కఠినమైన వర్కౌట్ చేస్తూ, వ్యాయామాలు చేస్తూ ఇష్టమైన ఆహారాన్ని కూడా తినకుండా పొట్టకట్టుకొని డైట్స్, వర్కౌట్స్‌ అని అహర్నిశలు శ్రమిస్తూ అందాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ గ్లామర్ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే కొంద‌రునటినటీలను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే జ‌నం ఇట్టే గుర్తుపట్టేస్తారు. కొందరు మాత్రం అసలు గుర్తుపట్టలేని విధంగా కవర్ చేసేస్తారు. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీస్‌కి సంబంధించిన పాత ఫొటోస్ నెటింట వైరల్‌గా మారాయి.

Mouni Roy troubled the director of Sultan of Delhi used to reach the set 3  hours late | Mouni Roy ने किया 'सुल्तान ऑफ दिल्ली' के डायरेक्टर को परेशान,  सेट पर पहुंचती

బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో అందాల రాసిగా వెలిగిపోతుంది. నెటింట ఈమె షేర్ చేసే ప్రతి ఫోటో తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఈ పై ఫోటోలో ఉన్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె ఇండస్ట్రీలోనే గ్లామర్ క్వీన్. లక్షలాది మంది అభిమానుల ఫేవరెట్ నటి. ఆమె ఎవరో కాదు స్టార్ బ్యూటీ మౌనిరాయ్. బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగిన్ హిందీ సీరియల్ ద్వారా ఫేమస్ అయినా ఈ అమ్మడు.. ఈ సీరియల్ తెలుగు, తమిళ, కన్నడ భాషలోనూ డబ్ కావ‌డంతో అన్ని చోట్లా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఈ సీరియల్‌కు అప్పట్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

Why won't Mouni Roy and hubby Suraj Nambiar walk the ramp together? | Hindi  Movie News - Times of India

కేరళకు చెందిన సూరజ్ నంబియా ను వివాహం చేసుకుంది మౌనీ. అతను దుబాయిలో బ్యాంకర్ గా చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం మౌని రాయ్ ఓల్డ్ పిక్స్ నటింట వైరల్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అప్పటికంటే ఇప్పుడు మరింత అందంగా మారిపోయిన మౌని రాయ్ సర్జరీ తర్వాత అసలు గుర్తుపట్టలేని విధంగా అందరినీ ఆకట్టుకుంటుంది. సీరియ‌ల్‌స్‌తో నటన రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కస్తూరి, దో స‌హేలియాన్‌, జానున్‌, దేవోమ్ కా దేవ్ మ‌హ‌దేవ్‌ లాంటి ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. అయితే ఈమెకు నాగిన్ సీరియల్ మాత్రమే ఊహించని రేంజ్ లో గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కేజీఎఫ్ హిందీ వ‌ర్ష‌న్‌ గాలి గాలి అనే పాటలోను మెప్పించింది. రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున నటించిన బ్రహ్మాస్త్రాలోను ఈమె ఆకట్టుకుంది.