ఎన్నో సమస్యలకు దివ్య ఔషధంగా జిల్లేడు.. ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

ప్రకృతి మనకు ఎన్నో దివ్య ఔషధ మొక్కలను ప్రసాదించింది. వాటిలో చాలా మొక్కల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. కానీ వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. భూమిపై పుష్కలంగా ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో జిల్లేడు ఒకటి. ఈ మొక్క బంజర భూముల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్క దానంతట అదే పెరుగుతుంది. దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలియదు. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. చాలామంది ఇంటి చుట్టూ కాళీ ఆవరణ ఉంటే పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. కానీ వాటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయని తెలియదు.

ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న జిల్లేడు మొక్క శాస్త్రీయ నామం కాలో ప్రోపిన్. ఈ జిల్లేడు మొక్కలోని కొమ్మలు, పూలు, ఆకులు…మొక్క‌నుంచి వచ్చే పాలు అన్నింటిలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. దీని కారణంగా శరీరంలో పేరుకుపోయిన ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దీని వాడ‌టం వ‌ల్ల‌ శరీరంలో ఎలాంటి నొప్పి నుండైనా ఉపశమనాన్ని కలిగిస్తుంది. తలనొప్పి, పైల్స్ నుంచి త్వరగా ఉపశమనాన్ని పొందవచ్చు. ప్రతిరోజు తప్పకుండా జిల్లేడు వాడితే శరీరం ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇందులో పువ్వులు, ఆకులు, కొమ్మలు ఎన్నో వ్యాధులకు చెక్ పెడతాయి. ఇది తలనొప్పి, చెవి నొప్పిని త్వరగా తగ్గిస్తుంది.

అలాగే మొక్క కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడానికి సహకరిస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల నేచురల్ గా ఆరోగ్యాన్ని పొందవచ్చు. జిల్లేడు ఆకులను నూనెతో కలిపి వాడడం వల్ల మంట తగ్గుతుంది. దీని పువ్వులను తీసుకోవడం వల్ల పైల్స్ లో తక్షణ ఉపశమనం అందుతుంది. పైల్స్ లాంటి తీవ్రమైన వ్యాధులను తగ్గించడానికి దీనిలో ఉండే నీరు సహకరిస్తుంది. దీని ఉపయోగించే ముందు వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం. ఇది యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ సిప్లిటిక్ మరియు యాంటీ రుమాటిక్ లక్షణాలు కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని వాడే విధానాన్ని ఒకసారి కచ్చితంగా తెలుసుకుని వాడడం మంచిది.