వేసవిలో నిత్యం వేధించే తలనొప్పికి మందులు వాడకుండా చెక్ పెట్టండి ఇలా..?!

వేసవిలో ప్ర‌తి ఎక‌రిని అధికంగా వేధించే సమస్యల్లో తలనొప్పి. ఎండల ప్రభావంతో డిహైడ్రేషన్, స్ట్రెస్, బ్లడ్ ప్రెషర్ అదుపుతప్పడం తదితర కారణాలతో తరచుగా తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. తలనొప్పి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ లేదా బామ్‌లు రాసుకుంటూ ఉపశమనం పొందుతూ ఉంటారు. కానీ ప్రతిసారి పెయిన్ కిల్లర్ వాడడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మందులు వాడకుండానే తలనొప్పి నుంచి ఎలా రిలీఫ్ పొందవచ్చు అనేది ఒకసారి తెలుసుకుందాం. వేసవిలో అధికంగా తలనొప్పి రావడానికి ప్రధాన కారణం డిహైడ్రేషన్.

5 Amazing benefits of coconut water for hair growth

కనుక బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దానికోసం తర‌చు వాటర్, ఫ్రూట్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, రాగిజావ లాంటి లిక్విడ్స్ ను శరీరానికి తగిన మోతాదులో అందిస్తూ ఉండాలి. ఇవి మనల్ని డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. మరియు బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ అందించి తలనొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే తలనొప్పికి యాలుకలు నేచురల్ మెడిసిన్‌గా పనిచేస్తూ ఉంటాయి. ఒక గ్లాస్ వాటర్‌లో మూడు నుంచి నాలుగు దంచిన యాలకులు వేసి మరిగించి.. గోరువెచ్చగా అయిన తర్వాత తాగడం వల్ల క్షణాల్లో రిలీఫ్ వస్తుంది. లెమన్ వాటర్, గ్రీన్ టీ, జింజర్ టీ, ఆరెంజ్ టీ లాంటివి తలనొప్పికి ఉపశమనంగా పనిచేస్తాయి. అయితే వేసవిలో చాలామంది ఏసీలకు అలవాటు పడిపోతూ ఉంటారు.Green Tea & Ginger Health Benefits | livestrong

ఎక్కువ సమయం ఏసీలలో గడపడం వల్ల కూడా తలనొప్పి సమస్య ఎదురవుతుంది. కనుక రాత్రింబ‌వళ్ళు ఏసీలోనే గడిపేయకుండా.. కాస్త చల్లబాటు సమయంలో బయటకు వచ్చి స్వచ్ఛమైన గాలిని కూడా ఆస్వాదిస్తూ ఉండాలి. రోజు ఈవినింగ్ వాక్‌కి వెళ్లడం మరింత సహాయపడుతుంది. నాచురల్ ఎయిర్ మైండ్ ని రిలీఫ్‌ చేసి స్ట్రెస్‌కు దూరంగా ఉంచుతుంది. తలనొప్పి నుండి రిలీఫ్ ఇస్తుంది. ఇక మండే ఎండల్లో తిరిగితే తలనొప్పి సాధారణంగానే వచ్చేస్తుంది. కనుక బయటకు వెళ్ళేటప్పుడు టోపీ, సన్ గ్లాసెస్ తప్పకుండా ధరించండి. ఎండవేడిని నివారించడానికి ఇవి కొంత సహకరిస్తాయి.