బన్నీ – చరణ్ లకే బిగ్ షాక్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఏం పని చేసాడో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ ఏం కొన్నా .. ఎక్కడికి వెళ్లినా.. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అయిపోతున్నాయి . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలలో అయితే స్టార్ సెలబ్రెటీస్ ని మించిపోతున్నారు.. స్టార్ డైరెక్టర్ లు.. స్టార్ ప్రొడ్యూసర్స్.. తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు అల్లు అరవింద్ . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ప్రొడ్యూసర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అరవింద్ .. తాజాగా ఒక కారు కొనుక్కున్నాడు .

అదేంటి కారు కొనుక్కుంటే పెద్ద మ్యాటర్ ఏంటి..? అనుకుంటున్నారా..? అయితే ఆయన కొన్న కారు ఖరీదు చాలా చాలా కాస్ట్లీ .. జనరల్ గా ఇంత బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలు మాత్రమే కార్లు కొనుక్కుంటూ ఉంటారు . మరి ముఖ్యంగా ఇప్పుడు అల్లు అరవింద్ కారు కొనుక్కున్న డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి . ఈ ఎలక్ట్రిక్ కారు ధర రెండున్నర కోట్ల పైనే ఉంటుంది అంటూ తెలుస్తుంది .

అంతేకాదు ఇది ఎంతో ఇష్టంగా అల్లు అరవింద్ కొనుక్కున్నారట. అత్యాధునిక టెక్నాలజీని ఇందులో వాడినట్లు తెలుస్తుంది . బీఎండబ్ల్యూఐ 7 బ్రాండ్ కు చెందిన ఈ కారు చాలా చాలా రేర్ పీస్ . అంతేకాదు జనరల్గా మెగా ఫ్యామిలీ లో యాక్సిస్సోరీస్ కి సంబంధించిన విషయాలు.. బన్నీ- చరణ్ లు వాడేవి మాత్రమే తెలుసుకోవడానికి ఇష్టపడతారు జనాలు. అయితే ఈసారి మాత్రం అందరూ అల్లు అరవింద్ పై పడ్డారు. అల్లు అరవింద్ కొన్న కారు గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో అల్లు అరవింద్ ..చరణ్ – తారక్ లనే మించిపోయాడు అంటూ పలువురు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!