పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారానికి దూరంగా మెగా హీరోస్.. కారణం అదేనా..?!

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్‌కు సపోర్ట్‌గా చాలామంది సెలబ్రిటీలు రావడంతో.. ఇప్పుడు ఆయన పార్టీ మరింత బలపడింది. ఈ సెలబ్రిటీస్ అంతా పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ప్రచారాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జనసేన ప్రచారంలో జబర్దస్త్ నటుడు ఆది, డ్యాన్స్ మాస్టర్ జానీ లాంటివాళ్ళు జతకట్టిన సంగతి తెలిసిందే. నిర్మాత బన్నీ వాస్ కూడా వీరికి తోడయ్యాడు. అయితే మెగా హీరోలు మాత్రం పవర్ స్టార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఎంటర్ కావడం లేదు.

ఈ విషయంలో ఈసారి మెగా ఫ్యామిలీ ఏమీ పట్టనట్లు ఉన్న సంగతి తెలిసిందే. నాగబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా.. మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోస్ వరుణ్ తేజ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా మిగిలిన మెగా హీరోలు ఎవ్వరూ పవర్ స్టార్ తరఫున ప్రచారానికి రావడం లేదు. ఏ ఒక్కరు రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పినట్లు సమాచారం. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ.. పవన్ పార్టీ తరఫున మెగా ఫ్యామిలీ ఎవరూ రాకపోవడంతో గట్టిగానే వార్తలు వైరల్ అవుతున్నాయి.

Choreographer Jani Master, Comedian Prudhvi joins Jana Sena - Telugu News -  IndiaGlitz.com

ఫస్ట్ వీక్ లో పిఠాపురం ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి వస్తారంటూ వార్తలు వినిపించిన.. మెగా హీరోలు ఎందుకు రావడం లేదు.. రానివ్వడం లేదు.. అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జబర్దస్త్ ఆది కంటే మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది కదా.. వారు కనుక జనసేన నియోజకవర్గం లో పర్యటించి ప్రచారం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కానీ ఎందుకు వారిని రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారు కెరీర్ కోసమా అంటూ.. అయితే పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలుస్తున్న పృథ్వీరాజ్, ఆది లాంటి చిన్న నటులకు కెరీర్ అవసరం లేదా అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పవన్ కావాలనే తెలివిగా రాజకీయాలకు దూరంగా మెగా హీరోలను ఉంచుతున్నాడు అంటూ ఆయన పై పలు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.