సమంత లైఫ్ లో ఆ ముగ్గురు సూపర్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా..? ఒక ఆడపిల్ల చెప్పాల్సిన పేర్లను చెప్పిందిగా..!

సమంత .. ఈ పేరు ఒకప్పుడు చెప్తే జనాలు సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు ..వారెవా సమంత అంటే అది అంటూ పొగిడేసేవాళ్ళు . బట్ ఇప్పుడు మొత్తం మారిపోయింది . సమంత పేరు చెప్తే ట్రెండ్ చేసే జనాలు కన్నా ట్రోల్ చేసే జనాలు ఎక్కువగా మారిపోయారు . దానికి కారణం ఏంటో కూడా మనకి తెలుసు. నాగచైతన్యతో విడాకులు తీసుకోవడమే అందుకు ప్రధాన కారణం ప్రజెంట్ సమంతకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రతి ఒక్క అమ్మాయికి తన లైఫ్ లో ఒక సూపర్ హీరో అంటూ ఉంటారు. అందులో ఫస్ట్ ప్లేస్ వాళ్ళ నాన్నదై ఉంటుంది . ఆ తర్వాతి స్థానం భర్త ది అయ్యి ఉంటుంది . ఆ తరువాత స్ధానం కచ్చితంగా కూతురు లేదా కొడుకుది ఉంటుంది. అయితే సమంత మాత్రం తన లైఫ్ లో ఉన్న ముగ్గురు సూపర్ హీరోస్ ఎవరు అంటే మొదటగా తన తల్లి పేరు చెప్పుకొచ్చింది . మా అమ్మ నా లైఫ్ కోసం చేసిన త్యాగం సాక్రిఫైసెస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను.. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే కారణం మా అమ్మే అంటూ చెప్పుకు వచ్చింది.

రెండవది తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ పేరు చెప్పకుండా తను నా సెకండ్ సూపర్ హీరో అంటూ చెప్పింది. మూడవది తన పెట్స్ అంటూ చెప్పుకొచ్చింది. పెట్స్ లేకపోతే నేనులేను .. నా లైఫ్ లో కీలక పాత్ర పోషించేది ఈ పెట్సే అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . దీంతో సమంత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . ఒక ఆడపిల్ల ఇలాగే ధైర్యంగా బోల్డ్ గా ఉండాలి అంటూ సమంత ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ప్రజెంట్ హీరోయిన్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . పలు డైరెక్టర్స్ కూడా ఆమెకు మంచి మంచి రోల్స్ ఇస్తున్నారు . కానీ సమంత కొన్ని పాత్రలే చేయాలి అంటే అంటూ లిమిట్ పెట్టుకొని ఉందట . అలాంటి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తోందట..!