సెకండ్ బాయ్ ఫ్రెండ్ తో శృతిహాసన్ బ్రేకప్.. ఇలా క్లారిటీ ఇచ్చేసిందా..?!

సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు దాదాపు అందరూ స్టార్ సెలబ్రేటీల స‌ర‌స‌న‌ నటించి మెప్పించిన ఈ అమ్మడు.. గత కొంతకాలంగా వరుస‌ సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా గడుపుతుంది. అయితే శృతిహాసన్.. శాంతాన్‌ హాజరిక అనే బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ జంట రొమాంటిక్ ఫొటోస్ స్టిల్స్ ఇస్తూ.. ఆ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. శృతిహాసన్ కూడా పలు ఇంటర్వ్యూ లో శాంత‌న్ హాజరిక గురించి మాట్లాడుతూ ఎన్నో పాజిటివ్ విషయాలను షేర్ చేసుకుంది.

Shruti Haasan on breakup with Michael Corsale: It was a good experience, I always look for one great love - India Today

అయితే తాజాగా అందుతున్న వార్తలు ప్రకారం శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిందట‌. ప్రముఖ డూడల్ ఆర్టిస్ట్ శాంతాన్ హాజారిక, శృతిహాసన్ కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే అందులో నిజం లేదని.. కానీ కొంతకాలంగా ఇద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. ఒకరితో ఒకరు బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో ఈ జంట తరచూ సోషల్ మీడియాలో వీరు కలిసి కనిపించిన ఫొటోస్, రొమాంటిక్ ఫొటోస్ ను షేర్ చేసుకుంటూ వచ్చేవారు.

Shruti Haasan and boyfriend Santanu Hazarika react to wedding rumours - India Today

అయితే కొంతకాలంగా వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించకపోవడం.. అలాగే వీరిద్దరికి సంబంధించిన ఏ ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోకపోవడంతో నెల రోజులుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్లు శృతిహాసన్ శాంతాన్ హ‌జారికా ఇద్ద‌రు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యండిల్స్‌లో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేశారు. శృతి తన ఖాతా నుంచి జంటగా దిగిన ఫోటోలను కూడా తొలగించడంతో ఆమె అభిమానులంతా షాక్ అవుతున్నారు. శాంతాన్‌కి ముందు.. లండన్ బెస్ట్ మైకేల్ కోర్సెల్ తో ప్రేమలో పడిన ఈ అమ్మడు.. అతడితో కొంతకాలం డేటింగ్ తర్వాత బ్రేకప్ ట్విస్ట్ ఇచ్చింది.

Shruti Haasan : అతనిది చాలా పెద్దది.. దారుణమైన కామెంట్ చేసిన శృతిహాసన్..!

తన బ్రేకప్ కారణాన్ని మాత్రం వివరించలేదు. కొంత కాలానికి శాంతాన్‌తో ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తాజాగా అతనితో కూడా బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. సలార్ తో మంచి సక్సెస్ అందుకున్న శృతి.. ప్రస్తుతం డెకాయిట్ సినిమా షూట్‌లో బిజీగా గడుతుంది. అడవి శేషు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే హాలీవుడ్ లోనూ ఈమె న‌టించిన దిఐ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్‌తో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది. ఈ ఆల్బమ్ కు ఎనిమోల్ అనే టైటిల్ తో యూట్యూబ్ లో షేర్ చేయగా ఇప్పటివరకు పది మిలియన్లు పైగా వ్యూస్ సాధించి రికార్డ్స్ సృష్టించింది.