త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మరో టాలీవుడ్ బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..?!

ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ నటినటులు చాలామంది సడన్గా పెళ్లి పీటలు ఎక్కి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏకంగా వెడ్డింగ్ వైబ్స్‌ అని కొన్ని ఫోటోలు అమ్మడు స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో నెటింట‌ ప్రస్తుతం చర్చనీయాంశముగా మారింది. గతంలో ఈమె పెళ్లి గురించి రూమర్స్ వినిపించాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరు.. పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం. తమిళ్ బ్యూటీ మేగా ఆకాశం లై సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది.

ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తుంది. గతేడాది ఏకంగా మూడు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో మెగా ఆకాష్ పెళ్లి గురించి వార్తలు నెట్ వైరల్ గా మారాయి. తమిళనాడుకు చెందిన ఓ పొలిటిషన్ కొడుకుని ఈమె పెళ్లి చేసుకుంటుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఎవరు స్పందించకపోవడంతో ఈ వార్తలు కనుమరుగయ్యాయి.

r/SouthIndianAngels - Megha Akash

తాజాగా మరోసారి కొత్త పెళ్ళికూతురు లుక్ లో మేఘ ఆకాష్ దర్శనం ఇవ్వడం.. వెడ్డింగ్ వైబ్స్‌ అంటూ దానికి ట్యాగ్ చేయ‌డంతో మరోసారి ఈమె మ్యారేజ్ నెటింట హాట్‌ టాపిక్ గా మారింది. త్వరలో ఈమె పెళ్లి చేసుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లి న్యూస్ నిజమే అయినా మరి కొన్ని రోజుల తర్వాత వీరిద్దరు పెళ్లి ఉండబోతుందని టాక్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం ట్రెడిషనల్ లుక్ లో మ్యారేజ్ వైబ్స్‌ అని షేర్ చేసుకున్న ఇమేజెస్ మాత్రం ఓ యాడ్ షూట్ కు సంబంధించిన పిక్స్ అని తెలుస్తోంది.