సినిమా టైంలో సిగరెట్లకు బానిసైన ఆ స్టార్ హీరోయిన్.. పొగ వస్తే ఆగలేను అంటూ..?!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ విద్యాబాలన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనూ ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలతో నెట్టింటి వైరల్ గా అయ్యే విద్యాబాలన్.. గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. తన కెరీర్ లో ఓ సినిమాలో సీన్ కోసం సిగరెట్ తాగాల్సి వచ్చిందని.. ఆ సినిమా తరువాత నుంచి సిగరెట్ వ్య‌సనంగా మారిపోయిందని.. అలవాటును చాలా కాలం పాటు విడిచిపెట్టలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది. దివంగత నటి సిల్క్ స్మిత జీవిత గాధ ఆధారంగా హిందీలో ది డర్టీ పిక్చర్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్ ఆక‌ట్టుకుంది.

When Vidya Balan took up chain-smoking for one of her films

అయితే ఈ సినిమా షూటింగ్ టైం లో ఆమె పాత్రను ప్లే చేసేందుకు సిగరెట్ తాగాల్సి వచ్చిందని.. కానీ ఆ షూటింగ్ ముగిసిన తర్వాత కూడా సిగరెట్ తాగడం అలవాటైపోయిందని.. నెమ్మదిగా సిగరెట్ వాసనను కూడా ఇష్టపడడం మొదలైంది అంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్. త‌ను మాట్లాడుతూ డ‌ర్టీ పిక్చర్ కు ముందు నేను స్మోక్ చేసేదాన్ని కాదని.. సిగరెట్ ఎలా తాగాలని తెలుసు కానీ ఎప్పుడూ దానిని ముట్టుకోలేదంటూ చెప్పుకొచ్చింది. కానీ కొన్ని సందర్భాల్లో పాత్రలు నేచురల్ గా రావాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అందుకే ఆ పాత్ర కోసం సిగరెట్ తాగాల్సి వచ్చింది. సిగరెట్ తాగే అమ్మాయిల గురించి ప్రజలు తమ మనసులో ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. ఎలాంటి ఒపీనియన్ ఏర్పరచుకుంటారు. అందుకే మొదట్లో సిగరెట్ పట్టుకోవాలంటే చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేదాన్ని.

Court clears The Dirty Picture for release | Bollywood - Hindustan Times

ఇప్పుడు గతంలోలా ఎవరు తీర్పు చెప్పేవారు ఉండరు. ది డర్టీ పిక్చర్ నన్ను సిగరెట్ తాగే అలవాటుకు బానిస చేసింది. నేను రోజుకు రెండు నుంచి మూడు సిగరెట్లు తాగేసే దాన్ని అంటూ వివరించింది. ప్రస్తుతం విద్యాబాలన్ చేసిన కామెంట్స్‌ వైరల్ అవుతున్నాయి. అయితే ఇంటర్వ్యూ వర్ ప్రశ్నిస్తూ ఇప్పటికి సిగరెట్ తాగుతున్నారా అని అడగగా.. కెమెరా ముందు దాని గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు. కానీ సిగరెట్ తాగడం నాకు చాలా ఇష్టం. సిగరెట్ తాగడం వల్ల నష్టమేమీ లేదని చెప్పి ఉంటే ఇప్పుడు కూడా నేను సిగరెట్ తాగేదాన్ని. నాకు సిగరెట్ వాసన అంటే అంత ఇష్టం. కాలేజీ టైంలో కూడా నాకు సిగరెట్ వాసన అంటే చాలా ఇష్టం. బస్ స్టాప్ లో పొగ తాగే వ్యక్తి పక్కనే నిల్చుని ఆ వాసనను పీల్చే దానిని అంటూ చెప్పుకొచ్చింది.