లేడీ టైగర్ లా ఉండే ఛార్మి.. ఇలా పిల్లి పిల్లలా మారిపోవడానికి కారణం ఆ ఒక్క తప్పేనా..?

ఛార్మి .. ఇప్పుడంటే ఈ పేరుకి ఇండస్ట్రీలో పెద్దగా పాపులారిటీ ..క్రేజ్ లేదు.. కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో ఊగిపోయి ..షర్ట్లు చించేసి గలాభా చేసుకునే వారో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా అప్పట్లో ఆమెను శివంగి అని లేడీ టైగర్ అని పిలిచేవాళ్ళు. అంత డేర్ గా ధైర్యంగా మాట్లాడగలిగే హీరోయిన్. ఏ డైరెక్టర్ తోనైనా ఏ హీరోతోనైనా ఇట్టే మింగిల్ అయిపోయే స్టార్…

తన కెరియర్లో ఆల్మోస్ట్ అందరి హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాదు తనదైన స్టైల్ లో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకుంది. కెరియర్ పిక్స్ లో ఉండగానే ఆమె తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలు ..ఆమెపై వచ్చిన రూమర్స్ .. ఆమె బ్రతుకును బస్టాండ్ చేసేసేయ్ .. మరీ ముఖ్యంగా పెళ్లయిన డైరెక్టర్ తో అఫైర్ నడుపుతుంది అంటూ ప్రచారం జరిగింది .

అప్పటికే దేవిశ్రీప్రసాద్ తో ప్రేమాయణం లో ఉంది అంటూ పెళ్లి చేసుకోబోతుంది.. అంటూ నేషనల్ మీడియా కూడా కోడై కూసింది. అదే మూమెంట్లో పెళ్లి అయ్యి ఒక బాబుకి తండ్రి అయిన డైరెక్టర్ తో ఎఫైర్ నడుపుతుంది అని తెలియడంతో ఆమె ఆఫర్స్ తగ్గిపోయాయి . మెల్లమెల్లగా జనాలు ఆమె పేరును మర్చిపోవడం స్టార్ట్ చేశారు. ఒకవేళ ఛార్మీ అప్పుడే ఆ వార్తలను ఖండించి ఉంటే బహుశా ఆమెకు ఇప్పుడు ఇలాంటి పోజీషన్ వచ్చి ఉండేది కాదేమో.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది ఈ ముద్దుగుమ్మ..!