పూనమ్ పాండే పై స్పందించిన డైరెక్టర్ ఆర్జీవి.. ట్వీట్ వైరల్..!

కాంట్రవర్షల్ డైరెక్టర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు ఆర్జీవి. ఇక తాజాగా గర్భాశయ క్యాన్సర్ తో మరణించా అంటూ ఓ కథని నడిపిన పూనమ్ పాండే పై స్పందించాడు.

ఈమె నిన్న గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయిందంటూ అనేక వార్తలు రావడంతో ప్రతి ఒక్కరు నమ్మారు. ఇక నేడు తాను బ్రతికే ఉన్నా అంటూ వీడియో పెట్టడంతో షాక్ అయ్యారు. ఇక దీనిపై ఆర్జీవి ఓ ట్వీట్ పెట్టారు. ” హే పూనమ్ పాండే.. ఈ సమస్యపై మీరు చేసిన పనితో అందరి దృష్టి మళ్లింది. ఇది మంచిది అయినప్పటికీ విమర్శలకు దారి తీయొచ్చు.

మీ ఉద్దేశాన్ని ఎవరు ప్రశ్నించలేరు. గర్భాశయ క్యాన్సర్ పై చర్చ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అలానే మీ ఆత్మ ఎంతో అద్భుతంగా ఉంది. మీరు సంతోషకరమైన సుదీర్ఘమైన జీవితాన్ని గడపండి ” అంటూ చెప్పుకొచ్చాడు ఆర్జీవి. ప్రస్తుతం ఆర్జీవి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.