హనుమాన్ రెమ్యూనరేషన్ విషయంలో మనస్పర్థలు .. క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టిన డైరెక్టర్..!

సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా విడుదలై మంచి సక్సెస్ ని అందుకున్న సినిమా హనుమాన్. ఇక ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ మూవీకి సీక్వెల్ ఉండబోతున్నట్లు ప్రశాంత్ వర్మ ముందే తెలియజేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది. హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా 3 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది. ఇక హనుమాన్ రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాత మరియు దర్శకుడు కి గొడవలు అయ్యాయని సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా వీటిపై ప్రశాంత్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేశాడు. నిర్మాత , తాను ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫోన్లో ఏదో చూస్తున్నటువంటి ఫోటోని షేర్ చేసి.. ఇలా నెగిటివిటీని పంచవద్దు.. మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాం. హనుమాన్ స్క్రిప్ట్ ను కొనసాగిస్తున్నాం.. అంటూ రాస్కొచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.