చెరుకు రసం ఇష్టంగా తాగుతున్నారా.. అయితే ఈ విష‌యాలు తప్పక తెలుసుకోండి..

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా చెరుకు రసాన్ని తాగుతూ ఉంటారు. ఇది కల్తీ లేని హెల్తీ డ్రింక్ అని అందరికీ తెలుసు. ఈ చెరుకు రసంలో కొద్దిగా అల్లం, నిమ్మరసం, కొంచెం పొదీనా వేసుకొని తాగితే అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే హెల్తీ డ్రింక్స్ లో ఇది ఒకటి అని.. అంత భావిస్తూ ఉంటారు. ఇలా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చెరుకు రసాన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. చెరుకు రసాన్ని తాగడం వల్ల.. అలసట దూరం చేయడంతో పాటు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తోంది.

ముఖ్యంగా వేసవి కాలంలో చెరుకు రసం తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ మనల్ని ఎప్పటికప్పుడు మరింత యాక్టీవ్ అయ్యేందుకు ప్రోత్సహిస్తాయి. ఈ రసంలో ఉండే షుగర్‌ని బాడీ త్బ‌ర‌గా డైజెస్ట్ చేసుకుంటుంది. బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు చెరుకు రసం తాగితే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చి త్వరగా కోలుకుంటారు. షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా చెరుకు రాసం తాగవచ్చట. ఇది ఎన్నో డెంటల్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెడుతుంది. ఈ జ్యూస్ కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయాన్ని కాపాడుతుంది. చెరుకు రసం శరీరం నుంచి టాక్సిన్స్ ఇన్ఫెక్షన్స్ తొలగించడానికి సహకరిస్తుంది.

అలాగే చెరుకు రసాన్ని తీసుకోవడం వల్ల మూత్రం నాలాల ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇది కిడ్నీలో సరైన పనితీరుకు సహకరిస్తుంది. మన శరీరానికి అవసరమైన పోషకాలు చెరుకు రసంలో అందుతాయి. ఎముకలు బలపడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాక.. ఒత్తిడిని కూడా తగ్గించే కెపాసిటీ చెరుకు రసం కలిగి ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంచడానికి చెరుకు రసం సహకరిస్తుంది. రక్తహీనతని కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్లను నివారించడమే కాక.. స్త్రీలలో వచ్చే గర్భధారణ సమస్యలకు మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతుంది. చెరుకును తినడం కంటే దీన్ని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.