ఎన్టీఆర్ కార‌ణంగా రూ.30 కోట్లు లాస్ అయిన ప్ర‌ముఖ సంస్థ‌.. ఏం జరిగిందంటే..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలతో పని చేయడానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్స్ ఎంతో ఆశ‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఉరి మూవీ సూపర్ హిట్ అయినా నేపథ్యంలో.. డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిమ్‌ ఒకటి రూపొందించడానికి ప్లాన్ చేశాడు. దానికి ఇమ్మోర్ట‌ల్ అశ్వద్ధామ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రోనీ స్క్రూవాల్‌ నిర్మాతగా, విక్కీ కౌశల్, సార అలీ ఖాన్ లను ఈ సినిమాలో ప్రధాన పాత్రులకు ఎంపిక చేసినట్లు ప్రకటించారు.

అయితే దీ ఫ్యామిలీ మ్యాన్ 2తో పాపులారిటీ దక్కించుకున్న సమంతను.. సారా ప్లేస్ లో రీప్లేస్ చేశారు. ఇక‌ కోవిడ్ కారణంగా ఆ నిర్మాత ఈ ప్రాజెక్టు చేయాలని దానిని పక్కన పెట్టేశాడు. తర్వాత జీ స్టూడియోస్ వాళ్ళు ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి సిద్ధమయ్యారు. అయితే రూ.350 కోట్ల నుంచి రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించాలని అనుకున్న ఈ సినిమాకి విక్కీ కాకుండా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలు అయితేనే బెటర్ అని జూనియర్ ఎన్టీఆర్, య‌ష్‌ లను అప్రోచ్ అయ్యారట. అయితే ఈ స్క్రిప్ట్ పై నమ్మకం లేని యష్ సున్నితంగా తిరస్కరించాడు.

ఎన్టీఆర్ మాత్రం ఏ విషయం తెల్చ‌కపోవడంతో కొంతకాలం వెయిట్ చేసినా మేకర్స్ రణ్‌వీర్‌ సింగ్ ను అప్రోచ్‌ అయ్యారు. అయితే అతను దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ పై సరిగ్గా వర్క్ చేయలేకపోతున్నాడట. దీంతో జీ స్టూడియో సంస్థ ఇటీవల ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది. ఎంతమందిని అప్రోచ్ అయి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నిర్వహించడంతో దాదాపు రూ. 30 కోట్ల వరకు ఖర్చు వృధా అయినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఆపకపోతే రూ.500 కోట్ల కష్టం వచ్చే ప్రమాదం ఉందని మేకర్స్ దీనిని అంతటితో ఆపేశారట.