అనుష్క ఏకంగా మూడుసార్లు ఆ మెగా హీరో సినిమాలను రిజెక్ట్ చేసిందా.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ బ్యూటీ.. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటుంది. అడపాదడపా సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఇక కెమెరాలకు దూరంగా ఉంటూ జీవితాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. కూల్ గా హ్యాపీ గా కెరీర్ కొనసాగిస్తుంది. అయితే ఈమె టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలతో నటించినప్పటికీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మాత్రం ఇప్పటివరకు ఒక సినిమాలో కూడా నటించలేదు.

రామ్ చరణ్‌తో నటించే అవకాశం రాక కాదు.. ఇప్పటికే ఆమెకు మూడుసార్లు చరణ్ సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చిందట. అయితే మూడుసార్లు ఆమె ఆ సినిమాలను రిజెక్ట్ చేసింది. దానికి కారణం ఏంటో.. అనుష్క రిజెక్ట్ చేసిన ఆ మూడు సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా వీరిద్దరి కాంబోలో మగధీర సినిమా మిస్ అయిందట. రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్లో తెర‌కెక్కిన ఈ సినిమా ఇండస్ట్రియల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదట అనుష్క హీరోయిన్ గా అనుకున్నారట. అయితే ఈ సినిమా టైంలో అనుష్క ఏవో వ్యక్తిగత కారణాలతో సినిమాను రిజెక్ట్ చేసిందని సమాచారం. అదే సినిమాతో భారీ పాపులాటి దక్కించుకున్న కాజల్.. తర్వాత స్టార్ హీరోయిన్గా పాపులర్ అయింది.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా పక్కా మాస్ మూవీగా వచ్చిన రచ్చ సినిమాలో కూడా అనుష్కనే ముందుగా హీరోయిన్ అనుకున్నారట. కానీ ఈ సినిమా స్టోరీ నచ్చకపోవడంతో అనుష్క సినిమాను రిజెక్ట్ చేసింది. వీరి కాంబోలో ముచ్చటగా మూడోసారి గోవిందుడు అందరివాడే సినిమా ఛాన్స్ వచ్చిందట.. మొదటి కృష్ణవంశీ ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా భావించి ఆమెను సంప్రదించగా.. అప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉన్న అనుష్క ఈ అవకాశాన్ని కూడా రిజెక్ట్ చేసిందంటూ తెలుస్తోంది. ఇలా ఇప్పటికే అనుష్క మెగా హీరో రామ్ చరణ్ సినిమా ఛాన్స్ ను మూడుసార్లు రిజెక్ట్ చేసిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ కు తెలియడంతో ఆమెపై ఫైర్ అవుతున్నారు.