వారెవా.. గోపీచంద్ ను స్టార్ హీరో చేసేందుకు ప్రభాస్ అలాంటి పని చేశాడా.. వాట్ ఏ ఫ్రెండ్షిప్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ఒకప్పుడు చిన్న హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వరుస సినిమాల్లో నటిస్తూ తన నటనతో సత్తా చాట్టాడు. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తూ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక చివరిగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ రికార్డులను క్రియేట్ చేసి రూ.700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రభాస్ కు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టక ముందు నుంచే హీరో గోపీచంద్ మంచి స్నేహితుడన విషయం చాలామందికి తెలుసు. అయితే గోపీచంద్ కెరీర్ పట్ల ప్రభాస్ కూడా చాలా కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం.

మొదట్లో మ్యాచో స్టార్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చేసిన తొలివలపు సినిమా డిజాస్టర్ అందుకుంది. ఆ తర్వాత ఆయన విలన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలోని గోపీచంద్ విలన్ గా మెప్పించాడు. ఈ సినిమా తో మంచి సక్సెస్ అందుకున్న గోపీచంద్ తర్వాత సినిమాల్లో హీరోగా మారాలని ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో ప్రభాస్ గోపీచంద్ కు మధ్యన ఉన్న ఫ్రెండ్‌షిప్ తో ప్రభాస్.. గోపీచంద్‌కి పరోక్షంగా సహాయం చేశాడట‌. పలువురు డైరెక్టర్లతో గోపీచంద్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయమని ప్రభాస్ వారికి సజెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పటికి ప్రభాస్ అలానే పలువురికి సజెస్ట్ చేశినా యూవీ క్రియేషన్స్ లో కూడా గోపీచంద్ తో సినిమాలు తీయమని చెప్పినా.. డైరెక్టర్ మారుతి, రాధాకృష్ణ లాంటి డైరెక్టర్లను రిఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఏదేమైనా గోపీచంద్‌ను స్టార్ హీరోగా చూడాలని ప్రభాస్ ఎంతో కష్టపడ్డాడని టాక్. అయితే స్క్రిప్ట్ సరిగ్గా లేకనో, లేదా డైరెక్టర్ల ఫాల్ట్ వల్ల తెలియదు కానీ ఇప్పటికీ గోపీ చంద్ స్టార్ హీరో క్రేజ్ అందుకోలేదు. కానీ వరుస సినిమాల్లో ఆఫర్లను దక్కించుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఫ్రెండ్‌షిప్ కోసం ప్రభాస్ అన్న ఎలాంటి త్యాగమైనా చేస్తాడు.. ఎలాంటి పని చేయడానికి అయినా రెడీగా ఉంటాడు అంటూ ప్రభాస్‌ను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎత్తేస్తున్నారు.