ఛీ.. ఛీ.. ఇంత దారుణమా.. గుడ్డిగా నమ్మినందుకు తారక్ ను ఆ ముగ్గురు డైరెక్టర్స్ ముంచేసారుగా..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. క్రేజీ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే సినిమా ఎంపిక విషయంలో కథ కన్నా కూడా మనుషులకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే ఎన్టీఆర్.. ఒక మనిషిని గుడ్డిగా నమ్మితే సినిమా కథను వినకున్న చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కొర‌టాల‌ శివ విషయంలో కూడా అదే జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య ఫెయిల్యూర్ తో కొరటాల శివ ఉన్న ఆయనపై నమ్మకంతో ఎన్టీఆర్ దేవర సినిమా చేయడానికి ఛాన్స్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే గతంలోనూ ఇలాగే కొంతమంది దర్శకులను గుడ్డిగా నమ్మి ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో.. ఆ డైరెక్టర్స్ ఎవరో చూద్దాం.

జూనియర్ ఎన్టీఆర్ గతంలో నరసింహుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. అయితే ఇలాంటి ఓ చెత్త కథను ఎన్టీఆర్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు అనే డిస్కషన్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. అయితే బి.గోపాల్ పై ఉన్న నమ్మకంతోనే ఆయన అంతకుముందు తీసిన సినిమాల రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేయడానికి తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కాగా బి.గోపాల్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. నరసింహుడు ఫ్లాప్‌గా నిలిచింది.

ఇక అత్యంత డిజాస్టర్ టాక్‌తో అశ్విని దత్ సంస్థని.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టని దిగజార్చిన ఒకే మూవీ శక్తి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బిగ్గెస్ట్ టాలీవుడ్ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పటివరకు మెహర్ రమేష్ తెరకెక్కించిన బిల్లా సినిమా తప్ప మరే సినిమా కూడా చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేదు. మెహ‌ర్ రమేష్ దాదాపు ఇప్పటివరకు తన నమ్మిన అందరూ హీరోలకి పరాజేయాలనే ఇస్తూ వచ్చాడు.

ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల‌లో బోయపాటి ఒకరు. ఈయన సాధారణంగా యాక్షన్స్ స‌న్నివేశాలతో కుమ్మేస్తాడు. హీరోలను ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తాడు. అదే నమ్మకంతో జూనియర్ ఎన్టీఆర్ బోయపాటికి అవకాశం ఇస్తే.. దమ్ము లాంటి డిజాస్టర్ ఇచ్చి చెత్త రికార్డును ఖాతాలో వేశాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ బోయపాటి కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ కాలేదు. ఇలా నమ్మకంతో అవకాశం ఇచ్చిన ఈ ముగ్గురు దర్శకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సక్సెస్ ఇవ్వలేకపోయారు.