అక్టోబర్ 10నే దేవరను ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..? దాని వెనుక ఉన్న అసలు సీక్రేట్ ఇదే..!

ఇన్నాళ్లు ఏప్రిల్ 5వ తేదీ దేవర రాబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు . కానీ ఆ సినిమా ఆరోజున రావడం లేదు అంటూ ఎన్టీఆర్ అఫీషియల్ గా ప్రకటించాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ – కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా దేవర . ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు .

నందమూరి ఫ్యాన్స్ అయితే అప్పుడెప్పుడోనే ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తాము అంటూ మేకర్స్ ప్రకటించారు . కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను అక్టోబర్ 10వ తేదీ దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నాము అంటూ అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం . కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు . అయితే అక్టోబర్ 10 న ఈ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి ఆగస్టు 15వ తేదీ ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారట కానీ ముందుగానే ఆ స్లాట్ లో పుష్ప2 ఉండడంతో దేవర వెనక్కు తగ్గి దసరా కానుకగా రావడానికి నిర్ణయించుకున్నారట.

అంతేకాదు దసరా కానుకగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి అన్న సెంటిమెంట్ కూడా ఉంది. పైగా గురువారంనాడు రిలీజ్ అయితే ఎన్టీఆర్ సినిమాలు బాక్సాఫీస్ చరిత్ర సృష్టిస్తాయి . గతంలో అరవింద సమేత వీర రాఘవ – జై లవకుశ – జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు గురువారం నాడే రిలీజ్ అయ్యాయి . ఆ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నారట . అంతేకాదు దసరా హాలిడేస్ .. పిల్లలు కూడా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు.. సినిమాకి మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ వస్తుంది అంటూ ఓ రేంజ్ లో ఈ సినిమాపై ఎక్స్పెక్ట్ చేస్తున్నారట టీం..!!